Thangalaan : తంగలాన్ మొదటి రోజు వసూళ్లు ఎంత..?

Thangalaan :   తంగలాన్ మొదటి రోజు వసూళ్లు ఎంత..?
X

రియలిస్టిక్ మూవీస్ తో తనదైన ఐడియాలజీని వెండితెరపై ఆవిష్కరిస్తూ ఆకట్టుకునే దర్శకుడు పా. రంజిత్. హీరో ఎవరైనా అతని కథలకు తగ్గట్టుగా మారిపోవాల్సిందే. ఇమేజ్ లను దాటి ఇంటెన్సిటీతో కూడిన కథలు చెప్పిస్తుంటాడా హీరోలతో. కొన్నాళ్ల క్రితం కబాలి, కాలా వంటి మూవీస్ తో తెలుగు వారికి సుపరిచితుడైన రంజిత్ ఈ సారి విక్రమ్ హీరోగా తంగలాన్ అనే మూవీతో వచ్చాడు. వందల యేళ్ల క్రితం ద్రవిడ భారత సంస్కృతి, సంప్రదాయాలు, మత పరమైన అంశాల చుట్టూ మొదలుపెట్టి.. ఈ దేశ మూలవాసులైన ఆది వాసులు అనాదిగా ఎలా దోపిడీకి గురయ్యారు అనే కథను అద్భుతంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. అయితే ఎక్కువ సబ్జెక్ట్ తో కూడిన కథ కావడంతో రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా కనిపించవు. అయినా మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుని సత్తా చాటింది తంగలాన్.

ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 26.44 కోట్లు వసూళ్లు చేసి అదరగొట్టింది. అయితే నార్త్ లో ఇంకా రిలీజ్ కాలేదు. ఉత్తర భారతంలో ఈ నెల 30న విడుదల కాబోతోంది. సో.. సౌత్ తో పాటు వేరే దేశాల నుంచి వచ్చిన వసూళ్లు ఇవి. ఓ రకంగా భారీ ఓపెనింగ్స్ అనే చెప్పాలి. మౌత్ టాక్ తో మరింత కలెక్షన్స్ వస్తాయంటున్నారు. ఇప్పటికే తెలుగులోనూ మంచి టాక్ నే తెచ్చుకుంది. తమిళ్, కన్నడ, మళయాల భాషల్లోనూ మౌత్ టాక్ తో దూసుకుపోతోందని ప్రచారం చేస్తున్నారు మేకర్స్.

ఇక విక్రమ్ వరల్డ్ క్లాస్ నటనతో మెస్మరైజ్ చేశాడు. అలాంటి నటన ఇప్పటి వరకూ ఇండియన్ స్క్రీన్ పై చూడలేదేమో అనిపిస్తుంది. మాళవిక మోహనన్, పార్వతి పాత్రలకు ఫిదా కాకుండా ఉండలేం. సింపుల్ గా చెబితే నటులెవరూ కనిపించరు. అందరూ పాత్రల్లాగే ఉన్నారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ ఈ మూవీకి బ్యాక్ బోన్ అంటే అతిశయోక్తి కాదు.

Tags

Next Story