Thangalaan Vikram : తెలుగులో తంగలాన్ దూకుడు

ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. కల్కి తర్వాత హిట్ అనే టాక్ మళ్లీ వినిపించలేదు కూడా. బట్ ఏ మాత్రం ప్రమోషన్స్ చేయకున్నా.. తమిళ్ డబ్బింగ్ మూవీ రాయన్ పై అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి. చాలామంది పాజిటివ్ గా మాట్లాడుకున్నారు. కాస్త ప్రమోషన్స్ చేసి ఉంటే రాయన్ తెలుగులో కూడా కమర్షియల్ గా పెద్ద విజయం సాధించేది. బట్ తంగలాన్ మూవీ మేక్స్ ఆ తప్పు చేయడం లేదు. తెలుగులో కూడా చాలా అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించిన మేకర్స్.. తర్వాత వరుసగా కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూస్ తో ఇది కేవలం దర్శకుడు పా. రంజిత్ శైలి సినిమానే కాదు.. కంప్లీట్ కమర్షియల్ వాల్యూస్ ఉన్న సినిమా అని క్లియర్ గా అర్థం అయ్యేలా చెప్పారు. అలాగే పా. రంజిత్ ఆలోచనా శైలిని కూడా రిప్రెజెంట్ చేస్తుందని చెప్పారు. ఇక విక్రమ్ తో పాటు హీరోయిన్లు పార్వతి, మాళవిక మోహనన్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కూడా ఇచ్చిన ఇంటర్వ్యూస్ మూవీకి తమిళ్ తో పాటు తెలుగులోనూ హెల్ప్ అవుతున్నాయి.
మామూలుగా డబ్బింగ్ సినిమాలు అంటే ప్రమోషన్స్ పరంగా కేవలం హైదరాబాద్ వరకే పరిమితం అవుతారు. బట్ తంగలాన్ దూకుడుగా కనిపిస్తోంది. హైదరాబాద్ తో పాటు విజయవాడలో కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు. కుదిరితే వైజాగ్ కూడా వెళతారేమో కానీ.. ఇలా వైడ్ యాంగిల్ లో ప్రమోషన్స్ చేయడం ఖచ్చితంగా మూవీకి ఎక్కువ ప్లస్అవుతుంది.
విక్రమ్ కు కొన్నాళ్లుగా హిట్ లేకపోయినా తెలుగులో అతనికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇటు పా. రంజిత్ కు సైతం ఇక్కడ అభిమానులున్నారు. కథ ఎలా ఉన్నా.. కథనంతో ఆకట్టుకుంటాడు రంజిత్. అతని గత చిత్రాల్లో ఒకటైన సార్పట్టై పరంపర ఓటిటిలో చూసి చాలామంది స్పెల్ బౌండ్ అయ్యారు. మరోసారి ఆ తరహాలో మెప్పిస్తే ఈ తంగలాన్ తో తెలుగులోనూ భారీ విజయం అందుకునే ఛాన్స్ ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com