ఆయన అరెస్టుపై సంతోషం వ్యక్తం చేసిన సుశాంత్ సిస్టర్ శ్వేత సింగ్

ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్‌కేసులో... రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్ అరెస్టు... మరింత హీట్ పెంచింది. వీరిద్దరిని ఈ రోజు కోర్టులో హాజరుపరిచారు. NCB అధికారులు వీళ్లద్దరినీ 6 రోజుల కస్టడీకి కోరుతుండగా... షోవిక్ లాయర్ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. షోవిక్ ఇంట్లో ఎలాంటి డ్రగ్స్ లభించకపోయినప్పటికీ... కేవలం వాట్సాప్ చాట్ ఆధారంగా కస్టడీ కోరడం సరికాదాన్నారు. కోర్టుకు తీసుకెళ్లడానికి ముందు.. షోవిక్, శామ్యూల్‌కు కరోనా టెస్టులు నిర్వహించగా నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇక త్వరలోనే రియా చక్రవర్తిని కూడా.. NCB అధికారులు అరెస్టు చేసే అవకాశాలున్నాయి.
సుశాంత్ కేసులో షోవిక్‌తోపాటు సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్ మిరాండా అరెస్టు.. గొప్ప ముందడుగని.. NCB డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా అన్నారు. వాళ్ల ఇద్దరిపైన చాలా స్పష్టమైన సాక్ష్యాలున్నాయని తెలిపారు. బాలీవుడ్‌తోపాటు ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీలతో లింక్‌లపైనా.. దర్యాప్తు చేస్తామన్నారు. షోవిక్ చక్రవర్తి అరెస్టుపై... సుశాంత్ సిస్టర్ శ్వేత సింగ్ ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. NCB గొప్పుగా ముందుకు సాగుతోందని ప్రశంసించారు. తామంతా సత్యంవైపు పయనించేలా మార్గదర్శనం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. సుశాంత్‌కు న్యాయం జరగాలని కోరుతున్నవారికి ఇదొక ఉపశమని అన్నారు.
అటు.. బాంద్రాలోని సుశాంత్ సింగ్ ఇంటికి సీబీఐ అధికారులు, AIIMS వైద్యుల బృందం చేరుకుంది. సుశాంత్ సోదరి మీతూ సింగ్ సమక్షంలో క్రైమ్ సీన్‌ను రిక్రియేట్ చేసి అధికారులు విచారణ జరపనున్నారు. షోవిక్ అరెస్టు తర్వాత... NCB అధికారులు.. రియాపై దృష్టిపెట్టనున్నారు. ఇప్పటికే ఆమెకు చెందిన అనేక వాట్సాప్ చాట్‌లు, బ్యాంక్ డీటేయిల్స్, క్రెడిట్ కార్డ్ వివరాలతో పూర్తి సమాచారాన్ని రాబట్టే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు లభించిన వివరాల ఆధారంగా రియా డ్రగ్స్ తీసుకున్నట్టు స్పష్టమవుతోందని NCB వర్గాలు అంటున్నాయి. అటు దీపేష్‌ను ఈ రోజు NCB అధికారులు విచారిస్తున్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com