Thank You Review : ఎమోషనల్ డ్రామా.. హార్ట్ టచింగ్ మ్యూజిక్.. నాగచైతన్య కొత్త లుక్..

Thank You Movie Review : నాగచైతన్య సరికొత్త లుక్‌తో థాంక్యూ మూవీతో మన ముందుకు వచ్చాడు. ఈ రోజు సినిమా చూసినవారు తమ అభిప్రాయాల్ని ట్విట్టర్లో పంచుకుంటున్నారు. ఈ మూవీ నాగచైతన్య కెరీర్‌లో మంచి మూవీ అన్నారు. తమన్ బీజేఎమ్ హార్ట్ టచింగ్‌గా ఉందన్నారు.
కథ విషయానికి వస్తే.. నారాయణ పురం అనే గ్రామంలో అభిరామ్ (నాగచైతన్య) పుట్టి ఆ తరువాత బిలియనేర్‌గా ఎదుగుతాడు. తాను బిలియనేర్ కావడానికి అనేక మంది సహకరిస్తారు. వాళ్లందరికీ కృతఘ్నత చెప్పడానికి బయలుదేరతాడు. మూడు వయసుల్లో నాగచైతన్య కనిపిస్తాడు. కథ, డైలాగ్స్ ఎమోషనల్‌గా సాగుతాయి.
విక్రమ్ కె కుమార్ థ్యాంక్యూ మూవీకి దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మించారు. రాశీ ఖన్నా, అవికాగోర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతాన్ని అందించగా పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com