Tharun Bhascker : తరుణ్ భాస్కర్ విడాకులుకు మనుషులు కావలెను

Tharun Bhascker : తరుణ్ భాస్కర్ విడాకులుకు మనుషులు కావలెను
X

విడాకులు అనగానే అయితే కోర్ట్ లో లేదా పెద్ద మనుషుల సమక్షంలోనే జరుగుతుంది కదా. తరుణ్ భాస్కర్ మాత్రం పెద్ద మనుషుల సమక్షంలో ‘ఇడుపు కాయితం’ రాసుకోవాలనుకుంటున్నాడు. కాకపోతే అందుకు పెద్ద మనుషులు లేరట. అందుకే ఎవరైనా ఉంటే తను ఇడుపు కాయితం తీసుకోబోతోన్న ‘‘ తేదీ 12 - 12 - 2024 బేస్తారం.. రోజున ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి గుడెనక సమ్మక్క సారలమ్మ గద్దెలకాడ మర్రిచెట్టు కింద జమ్మికుంట వాస్తవ్యుడైన బూర సమ్మయ్య గౌడ్ బిడ్డ శ్రీలతకు పొర్కపల్లి గ్రామ వాస్తవ్యులైన గోడిశాల పోశాలు కొడుకు శ్రీనివాస్ గౌడ్ కి ఇడుపు కాయితం పంచాయితీ జరుగుతాంది. ఆ పంచాయితీ పెద్దలుగా, సాక్షులుగా కుటుంబ సభ్యులుగా నటించడానికి నటీ నటులు కావాలే.. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు సంప్రదించండి..’’ అంటూ ఒక బాండ్ పేపర్ కూడా వదిలాడు.. ఇదంతా ఏంటీ అనుకుంటున్నారు కదా..?

యస్.. ఇదంతా తరుణ్ భాస్కర్ నటిస్తోన్న కొత్త సినిమాకు సంబంధించిన కాస్టింగ్ కాల్. ఈ కాస్టింగ్ కాల్ ఇన్నోవేటివ్ గా ఉంది కదా. మరి ఈ మూవీని నిర్మించేది ఎవరో తెలుసా.. విరాటపర్వం దర్శకుడు వేణు ఊడుగుల. తెలంగాణలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ అనిపించుకున్న ఈ ఇద్దరూ కలిసి ఒక సినిమా చేస్తున్నారంటే అందులో ఖచ్చితంగా తెలంగాణ మట్టి వాసన ఉంటుంది కదా. ఆ వాసన ఈ కాస్టింగ్ కాల్ తోనే తేలిపోయింది కదా.

హీరో నేపథ్యం గౌడ్ అని ఉండటం.. మిడిల్ క్లాస్ అనేలా ఎలివేట్ కావడం.. అలాంటి ఇద్దరు భార్య భర్తల మధ్య విభేదాలు.. విడిపోవడం అనేది సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా చూస్తాం. అలాంటి కంటెంట్ ఎంచుకున్నారంటే ఖచ్చితంగా విషయం ఉండే ఉంటుంది. ఇక ఈ మూవీతో వంశీ రెడ్డి దొండపాటి అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు. మొత్తంగా సినిమాను డిసెంబర 12న విడుదల చేయబోతున్నాం అనే క్లెవర్ అనౌన్స్ మెంట్ కూడా ఈ ఇడుపు కాయితంలో ఉండటం విశేషం.

Tags

Next Story