Varun Tej : పక్కోడిని తొక్కు.. అందలమెక్కు.. ఇదే వరుణ్ తేజ్ రూట్

Varun Tej :  పక్కోడిని తొక్కు.. అందలమెక్కు.. ఇదే వరుణ్ తేజ్ రూట్
X

వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా మట్కా. 1960ల నేపథ్యంలో మట్కా అనే జూదం నేపథ్యంలో రూపొందుతోన్న మూవీ ఇది. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా మట్కా నుంచి సెకండ్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతంలో భాస్కర భట్ల రాసిన ఈ గీతాన్ని మనో ఆలపించాడు. తస్సాదియ్యా అంటూ ఆ కాలాని తగ్గ ఇన్స్ స్ట్రుమెంటైజేషన్ తో వింటేజ్ ఫీల్ వచ్చేలా మనో గాత్రంలో ఆకట్టుకుంటోందీ గీతం.

మట్కా ద్వారా ఎదిగిన ఓ వ్యక్తి డబ్బు సంపాదించడానికి ఎన్ని అడ్డదారులైన తొక్కేయమంటూ బోధిస్తున్నట్టుగా ఉంది. అందులో భాగంగానే ‘లోకం నిండ డబ్బున్నది .. తోడేకొద్ది వస్తుంటది.. పక్కోడిని కిందికి తొక్కు ఒక్కడివే అందలమెక్కు.. జీవించుట మావన హక్కు కదా. నీకెప్పుడు నువ్వే దిక్కు.. ఏ డోరూ కొట్టదు లక్కు..’ అంటూ సాగే సాహిత్యం ఆకట్టుకుంటోంది. క్యారెక్టరేజషన్ ను తెలియజేసే పాట ఇది. అలాగని మాంటేజ్ సాంగ్ లా అనిపించడం లేదు.

కొన్నాళ్లుగా వరుణ్ తేజ్ కు హిట్టే లేదు. ఆ లోటును ఈ చిత్రం తీరుస్తుందని బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. పలాస తర్వాత కరుణ కుమార్ కూడా రెండు ఫ్లాపులు చూశాడు. ఈ సారి ఖచ్చితంగా నిరూపించుకోవాల్సిన సిట్యుయేషన్ లో ఉన్నాడు.

ఇక వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నోరాఫతేహీ, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించిన మట్కా నవంబర్ 14న విడుదల కాబోతోంది.

Tags

Next Story