Sai Pallavi : అందుకే ఆమెను కలిశా : సాయి పల్లవి

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా 'అమరన్'. రాజ్ కుమార్ పె రియసామి దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రంలో రాహుల్ బోస్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషన ల్ ప్రొడక్షన్స్తో కలిసి హీరో కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరద రాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోం ది. ఇందులో శివ కార్తికేయన్ ముకుంద్ పాత్ర పోషిస్తుంగా.. ఆయన సతీమణి ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో సాయిపల్ల వి నటిస్తోంది. ఈ సినిమాపై సాయిపల్లవి స్పందించింది.. తాను ఇప్పటి వరకూ బయోపిక్ లో నటించలేదని చెప్పింది. వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగిం చుకుంటూ పాత్రను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా వర్క్ చేశానని తెలిపింది. అమరన్ సినిమాలో రెబెకా రోల్ కు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలనుకున్నాని చెప్పింది. ముకుంద్ సతీమణి ఇందు రెబెకాను కలిశానని, ఆమెతో ఎన్నో విషయాలపై మాట్లాడానని చెప్పింది. పాత్రకు సంబంధించిన ఎమోషన్స్ గురించి ఓ క్లారిటీ తెచ్చుకున్నానని అంటోంది సాయిపల్లవి. సాయిపల్లవి పాత్రలో లీనమై వర్క్ చేస్తే గ్రాండ్ సక్సెస్ పక్కా అనే టాక్ వినిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com