Mohanlal : లూసీఫర్ సీక్వెల్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Mohanlal :  లూసీఫర్ సీక్వెల్ రిలీజ్ డేట్ వచ్చేసింది
X

2019లో విడుదలైన లూసీఫర్ మళయాలంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అక్కడ బాక్సాఫీస్ రికార్డులను బద్ధలు కొట్టింది. అదే చిత్రాన్ని తెలుగులో చిరంజీవి గాడ్ ఫాదర్ గా రీమేక్ చేసి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు మళయాలంలో లూసీఫర్ కు సీక్వెల్ గా ‘L2 ఎంపురాన్’ను రీసెంట్ గానే స్టార్ట్ చేశారు. స్టార్ హీరోల‌తో భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను నిర్మించే చిత్ర నిర్మాణ సంస్థ‌ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తోంది. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అందుకే మేక‌ర్స్ ఆ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను రీచ్ అయ్యేలా సీక్వెల్ ను భారీగా నిర్మిస్తున్నారు.

ఆ మధ్య మోహ‌న్‌లాల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘L2 ఎంపురాన్’ లో ఖురేషి అబ్ర‌మ్‌గా సూప‌ర్‌స్టార్ లుక్‌ను ... అలాగే పృథ్వీరాజ్ సుకుమార్ పోషిస్తోన్న క్యారెక్ట‌ర్ జయేద్ మసూద్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయ‌గా అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇంకా ఈ చిత్రంలో టోవినో థామ‌స్‌, మంజు వారియ‌ర్‌, నందు, సానియా అయ్య‌ప్ప‌న్ త‌దిత‌రులు మ‌రోసారి వారి పాత్ర‌ల‌తో మెప్పించ‌బోతున్నారు. తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించారు. 2025 మార్చి 27న ‘L2 ఎంపురాన్’ చిత్రం తెలుగు, మ‌ల‌యాళం, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ కానుంది. ఈ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు మేకర్స్. మంట‌ల మ‌ధ్య‌లో వైట్ ష‌ర్ట్ ధ‌రించిన మోహ‌న్ లాల్ లుక్‌ను బ్యాక్ సైడ్‌నుంచి ఎలివేట్ చేసేలా ఉన్న పోస్ట‌ర్ ప‌క్కా మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా సినిమా రూపొందుతోంద‌ని అంచ‌నాల‌ను పెంచేస్తోంది.


Tags

Next Story