Vijay Sethupathi : మహారాజు 2 రాబోతోందా..?

విజయ్ సేతుపతి కెరీర్ లోనే బెస్ట్ మూవీస్ లిస్ట్ లో ఫస్ట్ వరసలో నిలిచే సినిమా ‘మహారాజు’. నిథిలన్ సామినాథన్ డైరెక్షన్ లో రూపొందిన ఈ థ్రిల్లర్ కు దేశవ్యాప్తంగా జనాలు ఫిదా అయిపోయారు. విజయ్ సేతుపతి అద్భుత నటనకు ఆడియన్స్ మెస్మరైజ్ అయిపోయారు. విలన్ గా డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సైతం కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అని మెచ్చుకున్నారు. మరి అలాంటి కాంబోలో మరో సినిమా రాబోతోంది అంటే ఖచ్చితంగా మహారాజుకు సీక్వెల్ అనే అనుకుంటారు కదా. సీక్వెలా కాదా అనేది అప్పుడే చెప్పలేం కానీ.. నిథిలన్ సామినాథన్ డైరెక్షన్ లో విజయ్ సేతుపతి మరో సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు కోలీవుడ్ లో బలంగా వినిపిస్తున్నాయి.
నిథిలన్ సామినాథన్ స్క్రిప్ట్ విషయంలో పక్కాగా ఉంటాడు. సెట్స్ పైకి వెళ్లిన తర్వాత కథ, డైలాగ్స్ విషయంలో మళ్లీ సెకండ్ థాట్ అనేది కనిపించదు. అంత పర్ఫెక్ట్ గానే మహారాజును రూపొందించాడు అని చెప్పారు. మహారాజు తనకు రెండో సినిమా. మూడో సినిమా కథ కోసం కూడా ఎక్కువ టైమ్ తీసుకున్నాడు. ఈ కథ విజయ్ సేతుపతికి నచ్చిందని టాక్. అందుకే మరోసారి వీరి కాంబోలో మూవీ వస్తుందంటున్నారు. త్వరలోనే ఈ క్రేజీ కాంబోలో మూవీ అనౌన్స్ చేయబోతున్నారట. ఆ మధ్య విజయ్ సేతుపతి.. తను కొన్నాళ్ల పాటు హీరోగానే చేయాలనుకుంటున్నాను అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. అందుకే క్యారెక్టర్స్, విలన్ రోల్స్ ను ఈ మధ్య బాగా తగ్గించుకున్నాడు. సో.. నిథిలన్, విజయ్ సేతుపతి సినమా త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ కావొచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com