Tollywood: క్యాన్సర్ తో 'రెక్కీ 360' దర్శకుడు మృతి

Tollywood: క్యాన్సర్ తో రెక్కీ 360 దర్శకుడు మృతి
చిన్న వయసులోనే క్యాన్సర్ తో మృతి చెందిన ప్రముఖ దర్శకుడు

ఆర్యన్ రాజేష్ హీరోగా తెరకెక్కిన 'నిరీక్షణ' సినిమాతో సినీ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ (49) అకాల మరణం చెందారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన.. ఈ రోజు హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్.. "సీతారామ్"గా పరిశ్రమ వర్గాలకు సుపరిచితుడు. ఆయన హీరో శ్రీకాంత్ తో 'శత్రువు', నవదీప్ తో 'నటుడు' చిత్రాలకు దర్శత్వం వహించారు. రీసెంట్ గా ఆయన డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న'రెక్కీ 360' విడుదల సన్నాహాల్లో ఉంది. పలువురు ప్రముఖ దర్శకుల వద్ద రైటర్ గా, ఘోస్ట్ రైటర్ గా పనిచేసిన సీతారామ్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం.

'రెక్కీ 360' సినిమా గురించి..

సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లలో తెరకెక్కించే చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. కథ, అందులోని ఎమోషన్ కనెక్ట్ అయితే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించేస్తాయి.ఇక ఇప్పుడు RECCE 360 అనే సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించేందుకు వస్తోంది. స్నోబాల్ పిక్చర్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా రెక్కీ 360 తెరకెక్కిన ఈ సినిమాను కమలకృష్ణ నిర్మించారు. ఈ సినిమాతో అభిరామ్ హీరోగా పరిచయమవుతుండగా.. క్రేజీ కమెడియన్ భద్రమ్ సెకండ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమాలో అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లుగా నటిస్తున్నారు, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. క్రైం నేపథ్యంలో సాగే ఈ కథలో ఊహించని ట్విస్టులు ఉండనున్నట్టు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story