The Goat OTT Release : అక్టోబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో 'ది గోట్'!
దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది గోట్' ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. థియేటర్లలో విడుదలైన కొద్ది రోజులకే, అక్టోబర్ 3 నుండి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా ప్రసారం కానుంది. తెలుగు, తమిళం మాత్రమే కాకుండా మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.
విజయ్ ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ పోషించడం ప్రత్యేకత. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ యాక్షన్ కి మంచి పేరొచ్చింది. తెలుగులో మిశ్రమ స్పందన లభించినప్పటికీ, తమిళంలో ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది.
'ది గోట్' సినిమా ఓటీటీలోకి రావడంతో విజయ్ ఫ్యాన్స్‌కు పండగే. థియేటర్‌లో చూడలేకపోయిన వారు ఇప్పుడు ఇంటి నుండే ఈ సినిమాను ఆస్వాదించే అవకాశం లభించింది. మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ వల్ల ఈ సినిమాకు గ్లోబల్ ఆడియన్స్ చేరే అవకాశం ఉంది. ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com