Vijay : స్టార్ హీరో ఫ్యామిలీకి 50లక్షలు ఇచ్చిన విజయ్.. ఎందుకంటే..

Vijay :  స్టార్ హీరో ఫ్యామిలీకి 50లక్షలు ఇచ్చిన విజయ్.. ఎందుకంటే..
X

దళపతి విజయ్ నటించిన గోట్ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కాబోతోంది. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన గోట్ పై ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే విజయ్ గోట్ బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నారు విజయ్ ఫ్యాన్స్. తెలుగులో ఈ మూవీని పెద్దగా ప్రమోట్ చేయడం లేదు. దీంతో తెలుగు ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయ్యారు. ఆ విషయం పక్కన బెడితే తాజాగా విజయ్ చేసిన ఒక పనికి కోలీవుడ్ మొత్తం ఫిదా అయింది.

ఒకప్పటి తమిళ్ టాప్ హీరో విజయ్ కాంత్ అంటే విజయ్ కి చాలా ఇష్టం. విజయ్ హీరోగా తడబడుతోన్న టైమ్ లో విజయ్ కాంత్ తనతో పాటు ఓ సినిమాలో అవకాశం ఇచ్చి.. ఆ మూవీ హిట్ అయ్యేలా చేశాడు. అప్పటి నుంచి విజయ్ కాంత్ అంటే విజయ్ చాలా ఇష్టంతో కూడిన గౌరవం. తమిళ్ ఫ్యాన్స్ ప్రేమగా కెప్టెన్ అని పిలుచుకునే విజయ్ కాంత్ కొన్నాళ్ల క్రితం మరణించారు.

విజయ్ తన గోట్ మూవీలో విజయ్ కాంత్ కు సంబంధించిన ఒక సీన్ ఉండాలనుకున్నాడు. ఈ మేరకు ఏఐ టెక్నాలజీ ద్వారా ఆయన సినిమాలో నటించినట్టుగా ఉన్న ఒక సీన్ క్రియేట్ చేశారు. రీసెంట్ గా భారతీయుడు 2 లో వివేక్, నెడిముడి వేణు ఉన్నట్టుగా కనిపించింది. కానీ అప్పటికే వారు చనిపోయారు. అలా అన్నమాట. అయితే తన సినిమాలో విజయ్ కాంత్ నటించినట్టుగానే భావించిన విజయ్ ఆ పాత్రకు గానూ 50లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందించాడు. నిజానికి చిన్న పర్మిషన్ అడిగితే విజయ్ కాంత్ ఫ్యామిలీ కాదనేవారు కాదు. బట్ విజయ్.. ఆయనపై ఉన్న గౌరవంతో నటించిన దానికి పారితోషికంగా ఈ 50లక్షలు అందించాడు. ప్రస్తుతం ఇది కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Tags

Next Story