Champion Telugu Movie : ఛాంపియన్ కు పెరుగుతున్న ఆదరణ

రోషన్ హీరోగా నటించిన మూవీ ఛాంపియన్. ఈ ఫ్రైడే రిలీజ్ అయిన ఈ మూవీకి కంప్లీట్ గా పాజిటివ్ టాక్ వచ్చింది. పీరియాడికల్ బ్యాక్ డ్రామాలో రూపొందిన సినిమాలో అన్ని అంశాలూ మిక్స్ చేసి చూపించారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ స్వాతంత్ర్యం తర్వాత కూడా తెలంగాణలో నిజాం పాలన ఉండటం.. రజాకార్ల రాజ్యం సాగించడం.. ఆపై ప్రజలపై అనేక దౌర్జన్యాలు, అక్రమాలు, అమానుషాలు, ఆకృత్యాలు జరగడం చూపించారు. దానిపై పోరాటం చేసిన కుర్రాడుగా రోషన్ నటించిన పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అతని క్యారెక్టర్ లో అన్ని అంశాలూ మిక్స్ అయి ఆ పాత్రకే హైలెట్ గా నిలిచాడు.
ఇక ఈ మూవీకి రిలీజ్ అయిన రోజునే మంచి వసూళ్లు వచ్చాయి. రెండో రోజు ఆ వసూళ్లకు అంతకు మించి రాబోతున్నాయి అనిపించేలా ఉంది. బుక్ మై షో లో కనిపించిన ఈ ఫిగర్స్ మూవీకి మంచి వసూళ్లు వచ్చేలా కనిపిస్తోంది. వీకెండ్ కావడం.. అంతకు మించి మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో హైలెట్ గా నిలిచింది. అయితే ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో మాత్రం మంచి వసూళ్లు వచ్చేలా కనిపిస్తున్నాయి. అదే టైమ్ లో ఓవర్శీస్ లో కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ మొత్తంగా కనిపించే మూవీకి సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు.
ఇక రోషన్ సరసన అనస్వర రాజన్ హీరోయిన్ గానటించింది. కళ్యాణ్ చక్రవర్తి, మురళీ శర్మ, కేకే మీనన్ వంటి నటులతో ఆకట్టుకునేలా ఉంది మూవీ. మొత్తంగా భారీ వసూళ్లు వచ్చేలా కనిపిస్తోందీ మూవీ. ఈ మూవీతో రోషన్ ఇకపై వరుసగా సినిమాలు చేయబోతున్నాడు అనిపించాడు. హీరోగా అన్ని రకాలుగా ఆకట్టుకునేలా ఉంటాడు అనిపించుకున్నాడు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

