Chiranjeevi : మెగాస్టార్ కు హీరోయిన్ సెట్ అయింది..

Chiranjeevi :  మెగాస్టార్ కు హీరోయిన్ సెట్ అయింది..
X

మన శంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ తో రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. నిజంగా ఈ మూవీ సాధించిన విజయం చాలా పెద్దదే. దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన మ్యాజిక్ బాగా వర్కవుట్ అయింది. ఆ కారణంగా ఆల్ టైమ్ హయ్యొస్ట్ వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకెక్కిందీ మూవీ. ఇక ఈ ఏజ్ లో కూడా ఏ మాత్రం గ్యాప్ లేకుండా దూసుకుపోవడం చిరంజీవి స్టైల్ గానే చెప్పాలి. విశ్వంభర విడుదలకు ముస్తాబవుతోంది. మామూలుగా ఇది ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా. విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ బాలేకపోవడంతో ఆపేశారు. తిరిగి మళ్లీ ఆ వర్క్స్ చేస్తున్నారు. దీనికోసం చాలా టైమ్ తీసుకున్నారు. ఆ కారణంగా ఈ యేడాది జూలైలో లేదా ఆగస్ట్ లో విడుదల చేస్తారు అనే టాక్ ఉంది.

సంక్రాంతి మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నా.. వెంటనే మరో సినిమా అనౌన్స్ చేశాడు చిరంజీవి. వాల్తేర్ వీరయ్యతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న బాబీ దర్శకత్వంలోనే మరో మూవీ చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని కూడా 2027 సంక్రాంతికి విడుదల చేస్తారు అనే టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ చాలా వేగంగా సాగుతోంది. ఆల్రెడీ మళయాల నటి అనస్వర రాజన్ ను ఇందులో హీరో కూతురుగా నటించేందుకు ఒప్పించారు. మరి హీరోయిన్ ఎవరు అనే ప్రశ్నకు కూడా సమాధానం దొరికింది. సీనియర్ నటి ప్రియమణి మెగాస్టార్ కు జోడీగా నటించబోతోందని టాక్. ప్రియమణి ఈ మధ్య చేస్తోన్న మూవీస్ అన్నీ విజయం సాధిస్తున్నాయి. చాలా సెలెక్టెడ్ గా వెళుతోంది. దీంతో పాటు ఫ్యామిలీ మేన్ అనే బాలీవుడ్ సిరీస్ లతో కూడా బాగా ఫేమ్ అయింది. అలాంటి బ్యూటీ చిరంజీవికి జోడీ అంటే ప్లస్ అయినట్టే అని చెప్పాలి. ఇక ఇందులో విలన్ ను కూడా ఫైనల్ చేశాడు బాబీ. అనురాగ్ కశ్యప్ ను విలన్ గా తీసుకున్నారు. అనురాగ్ ఈ మధ్య దర్శకత్వానికి కామా పెట్టి నటనలో సీరియస్ కనిపిస్తున్నాడు. పైగా తమిళ్ లో మంచి డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్ గానూ ఉన్నాడు. ప్రస్తుతం డెకాయిట్ మూవీలో కనిపించబోతున్నాడు. మొత్తంగా చిరంజీవి - బాబీ కాంబినేషన్ లో ప్రీ ప్రొడక్షన్ మాత్రం చాలా వేగంగా సాగుతోంది.

Tags

Next Story