Ram Charan : రామ్ చరణ్ కెరీర్ లోనే హయ్యొస్ట్ డీల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లోనే హయ్యొస్ట్ డీల్ సెట్ అయింది. బుచ్చిబాబు డైరెక్షన్ లో రూపొందుతోన్న ‘పెద్ది’ మూవీ ఆడియో రైట్స్ అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ నంబర్ కు సేల్ అయిపోయిందనే వార్తలు వస్తున్నాయి. గేమ్ ఛేంజర్ నిరాశపరిచినా ఈ మూవీ రామ్ చరణ్ కెరీర్ లోనే ఓ స్పెషల్ మూవీ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నారు. ఉప్పెన తర్వాత గ్యాప్ తీసుకున్నా.. బుచ్చిబాబు రికార్డ్ బ్రేకింగ్ మూవీని అందించబోతున్నాడు అనే టాక్ టాలీవుడ్ అంతా వినిపిస్తోంది. ఇంతకు ముందు రంగస్థలంలో మాస్ గెటప్ తో కనిపించిన రామ్ చరణ్ ఈ సారి ఊరమాస్ గా కనిపించబోతున్నాడు. ఈ మూవీ గ్లింప్స్ ను ఈ నెల 6న శ్రీ రామనవమి సందర్భంగా విడుదల చేయబోతున్నారు.
ఇక ఈ మూవీకి సంబంధించిన ఆడియో రైట్స్ విషయంలోనే రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయిందనే వార్తలు వస్తున్నాయి. అంటే పెద్ది రికార్డ్ ల వేట స్టార్ట్ అయిందన్నమాట. ఆదిత్య మ్యూజిక్ పెద్ది మ్యూజికల్ రైట్స్ ను దాదాపు 30 కోట్ల వరకూ చెల్లించి దక్కించుకుందంటున్నారు. చరణ్ కు ఇదే హయ్యొస్ట్ ప్రైస్ కావడం వల్లే రికార్డ్ అయింది. కాకపోతే ఇది ఆల్ టైమ్ రికార్డ్ కాదు. టాప్ ప్లేస్ లో పుష్ప 2 ఉంది. ఈ మూవీ ఏకంగా 65 కోట్లకు అమ్ముడుపోయింది. బట్ రామ్ చరణ్ కెరీర్ వరకూ చూస్తే పెద్ది ఆడియో రైట్స్ హయ్యొస్ట్ ప్రైస్ అన్నమాట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com