Jana Nayakudu Trailer : భగవంత్ కేసరికి మించేలా జన నాయకుడు

దళపతి విజయ్ లాస్ట్ మూవీ అంటే ఎలా ఉండాలి.. అంటే ఇదుగో ఎలా ఉంటుంది అనిపించేలా రూపొందించిన సినిమా జన నాయకుడు. అంతా చెప్పుకున్నట్టుగానే ఈ మూవీ బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన భగవంత్ కేసరి మూవీకి రీమేక్ గా రూపొందుతోంది. అయితే అందులో మార్పులు మాత్రం చాలానే చేసినట్టుగా ఉన్నారు. ఆ మూవీలోని కోర్ పాయింట్ ను మాత్రమే తీసుకున్నట్టుగా సినిమాకు యాక్షన్, మాస్, మసాలాలు కూడా దట్టించినట్టుగానే ఉన్నారు. ఆ మేరకు విజయ్ ఇమేజ్ కు తగ్గట్టుగా అలాగే పొలిటికల్ ఎంట్రీకి సరిపోయేలా కథనం వండి వార్చినట్టు కనిపిస్తోంది. కాకపోతే ఈ ట్రైలర్ తమిళ్ ఆడియన్స్ కు మాత్రం ఓ రేంజ్ లో నచ్చేసింది.
భగవంత్ కేసరిలోని పాయింట్స్ తోనే ఎక్కువగా ట్రైలర్ లో నింపేశారు. జైలు ఎపిసోడ్, మమితా బైజు ఆర్మీఅమ్మాయిగా అయ్యే ఎపిసోడ్, పూజా హెగ్డే పాయింట్స్ అన్నీ హైలెట్ గానే రూపొందించారు. కాకపోతే మాస్ ఆడియన్స్ ను బాగా టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. పైగా విలన్ ఎపిసోడ్స్ ను ఈ సారి స్ట్రాంగ్ గా నింపినట్టుగా ఉంది. ఆ కోణంలోనే పొలిటికల్ థింగ్స్ యాడ్ అయ్యేలా ఉన్నాయి. అతని పొలిటికల్ ఎంట్రీకి తగ్గట్టుగానే ఈ ఎపిసోడ్స్ అన్నీ యాడ్ అయ్యాయి అన్నట్టుగా ఉంది. బట్ ట్రైలర్ గా మాత్రం చాలా బావుంది. విజయ్ రెగ్యులర్ మూవీలాగానే చేస్తూనే పొలిటికల్ ఎంట్రీకి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్నట్టు చేశాడు.
సింపుల్ గా చూస్తే భగవంత్ కేసరిని రీమేక్ చేశాడు అనేది స్పష్టంగా కనిపిస్తూనే మాస్ ఆడియన్స్ కు తగ్గట్టుగా మార్పులు, చేర్పులు చేశారు అనిపించేలా ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

