The Kerala Story: రూ.80 కోట్ల మార్కును దాటిన 'ది కేరళ స్టోరీ' వసూళ్లు

విడుదలైన మొదటిరోజు నుంచే వివాదాలను ఎదుర్కొన్న 'ది కేరళ స్టోరీ' భారీ వసూళ్లను సాధించింది. రిలీజైన 7 రోజుల్లోనే రూ.81కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో అదా శర్మ లీడ్ రోల్ ను చేశారు. కేరళలోని మహిళలను బలవంతంగా మతం మార్చి ఆతర్వాత తీవ్రవాద సంస్థల్లో ఎలా రిక్రూట్ చేయబడుతున్నారో అన్న అంశంపై సినిమా తెరకెక్కింది. ఈ సినిమా దర్శకుడు సుదీప్తో సేన్ మాట్లాడుతూ నిజజీవితాల ఆదారంగానే కథను రెడీ చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రేక్షకులు చేపెడుతున్న ఆదరణను తాను ఎన్నడూ మర్చిపోనని చెప్పారు. పశ్చిమ బెంగాళ్ లో నిషేధాన్ని ఎదుర్కొన్నా మంచి వసూళ్లను సాధిస్తుంది. విడుదలైన వారం రోజుల్లో 100కోట్ల మార్క్ కు చేరువలో ఉంది. ఇది ఖచ్చితంగా రెండవ శనివారంలోగా 100కోట్లను దాటిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులను ఉద్దేశించి దర్శకుడు ట్వీట్ చేశారు. కేవలం 7 రోజుల్లో 81 కోట్ల రూపాయలను వసూలు చేసిన తన చిత్రం, ది కేరళ స్టోరీ గురించి సంతోషిస్తున్నట్లు తెలిపాడు. మే 8న రిలీజ్ అయిన ఈ సినిమా పశ్చిమ బెంగాల్‌లో నిషేధాన్ని ఎదుర్కొన్నప్పటికీ... అదే సమయంలో, యుపి, హర్యానా, ఎంపిలలో పన్నును ఎత్తివేశారు. “భారతదేశంలో ఇప్పటివరకు 6000,000 మందికి పైగా ఈ చిత్రాన్ని చూశారు. ఈరోజు కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. కేరళ స్టోరీ 40 కంటే ఎక్కువ దేశాలలో విడుదల చేసాము... మరిన్ని దేశాలలో కూడా విడుదల చేయనున్నాము. మేము మరింత బాధ్యతగా ఉంటాము. మీ ఆశీర్వదం కావాలి. #TheKeralaStory #VipulAmrutlalShah @adah_sharma Aashin_A_Shah @SiddhiIdnani @soniabalani9 (sic)." అని ట్వీట్ చేశారు.
భారతదేశంలో ఆదరణ పొందిన తరువాత, ది కెరల్ స్టోరీ నిర్మాతలు ఈరోజు మే 12న 37 దేశాల్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేరళలోని మహిళలు ఇస్లాం మతంలోకి బలవంతంగా మారడానికి, ISISచే ఎలా రిక్రూట్ చేయబడ్డారో తెరకెక్కించినట్లు చెప్పారు. గత వారం విడుదలైన ఈ సినిమా వివాదాలకు కేంద్ర బిందువైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com