Samantha : VD11 లాంచ్ ఈవెంట్‌లో సమంత లేకపోవడానికి కారణం ఏంటీ?

Samantha : రౌడి స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తమ 19వ సినిమాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో విజయ్ సరసన స్టార్ హీరోయిన్ సమంత నాయికగా నటిస్తోంది.
ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు గురువారం హైదరాబాద్ లో వైభవంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీశ్ శంకర్ క్లాప్ ఇవ్వగా.. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అయితే ఈ కార్యక్రమానికి హీరోయిన్ సమంత హాజరు కాలేదు.
అయితే ఆమె ఎందుకు హాజరు కాలేదో తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రస్తుతం సమంత దుబాయ్‌లో ఉంది.. అక్కడ హాలిడేస్‌లో బిజీగా గడుపుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన హాలిడే చిత్రాలను కూడా పోస్ట్ చేసింది. అందుకే VD11 లాంచ్ ఈవెంట్ కి సామ్ హాజరు కాలేదు.
కాగా మజిలీ సినిమా తర్వాత శివ నిర్వాణతో, మహానటి చిత్రం తర్వాత విజయ్ దేవరకొండతో రెండోసారి కలిసి పనిచేస్తోంది సామ్.. మరోవైపు తమిళ్ లో నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన కాతు వాకుల రెండు కాదల్ లో సమంత నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదల కానుంది.
ఇక తెలుగులో యశోద మరియు శాకుంతలం సినిమాలలో కూడా నటిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com