Bigg Boss Nonstop : బిగ్‌‌బాస్ నాన్‌స్టాప్ ఫెయిల్యూర్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి?

Bigg Boss Nonstop : బిగ్‌‌బాస్ నాన్‌స్టాప్ ఫెయిల్యూర్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి?
Bigg Boss Nonstop : ఎన్నో అంచనాలతో హాట్ స్టార్‌‌లో బిగ్‌‌బాస్ నాన్‌స్టాప్ ప్రేక్షకుల మందుకు వచ్చింది. అయితే ఈ షో మొదటి వారం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదని తెలుస్తోంది.

Bigg Boss Nonstop : ఎన్నో అంచనాలతో హాట్ స్టార్‌‌లో బిగ్‌‌బాస్ నాన్‌స్టాప్ ప్రేక్షకుల మందుకు వచ్చింది. అయితే ఈ షో మొదటి వారం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదని తెలుస్తోంది. నిజానికి OTTలో ఈ షో ప్లాన్ చేసినప్పుడు 24 గంటలూ లైవ్ వస్తుందని చెప్పారు కానీ .. ఒక్కరోజు మొత్తం షోని నిలిపివేయడమే కాకుండా, 24 గంటల కంటెంట్‌‌ని గంటకు కుదించారు. ఈ నేపథ్యంలో బిగ్‌‌బాస్ లవర్స్ కూడా ఈ రియాల్టీ షో పైన ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తోంది.

అయితే ఈ షో పైన ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి ప్రధానంగా అయిదు కారణాలను గమనించవచ్చు..!

బిగ్‌‌బాస్ షోని 24 గంటలు OTTలో పెట్టడాన్ని మొదటి నుంచి ప్రేక్షకులు వ్యతిరేకించారు.. 24 గంటలు షోని ఫాలో అవ్వాలి అంటే అది జరగని పని.. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు.. సో దీనితో షో పైన ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ పోయింది.

♦ బిగ్‌‌బాస్ నాన్‌స్టాప్ షోలో సీనియర్లు, జూనియర్లు మిక్స్ అవ్వడం కూడా షోపై ఆసక్తిని తగ్గించింది. కనీసం ఫేమస్ సెలబ్రిటీలనైనా తీసుకొని వస్తే షో మరో రేంజ్‌‌లో ఉండేదేమో... కానీ, ఆల్రెడీ బిగ్‌‌బాస్ షోలో పాల్గొన్న వాళ్ళే మళ్ళీ ఇందులో కూడా ఉండడం, వారి ఆట ఎలా ఉంటుందో ప్రేక్షకులు చూశారు కాబట్టి ప్రేక్షకులలో షో పైన ఆసక్తిని తగ్గించింది.

♦ బిగ్‌‌బాస్ నాన్‌స్టాప్ షోకి కూడా నాగార్జుననే హోస్ట్ కావడం కూడా ప్రేక్షకులకు రుచించడం లేదు. కనీసం హోస్ట్ అయినా మారిస్తే షోపైన కాస్త ఆసక్తి నెలకొనేది.

♦ షో ప్రోమోలు కూడా ఆసక్తికరంగా లేకపోవడం మరో కారణంగా చెప్పుకోవచ్చు.

♦ ఇక మెయిన్ రీజన్ డేటా.. ఈ షోని 24 గంటలు పాటు చూడాలంటే నెట్ బ్యాలెన్స్ అవసరం.. దాదాపుగా అందరివి మొబైల్ డేటానే .. వైఫైని ఉపయోగించే వారి సంఖ్య కూడా చాలా తక్కువ .. డేటా ప్లాన్‌లు కూడా హెవీగా ఉండడంతో షో పైన ఇంట్రెస్ట్ తగ్గిపోయింది.

Tags

Read MoreRead Less
Next Story