Bhimaa : ఇద్దరు భామలతో స్టెప్పులేయనున్న గోపీచంద్

Bhimaa : ఇద్దరు భామలతో స్టెప్పులేయనున్న గోపీచంద్
X
'భీమా'లోని హీరోయిన్స్ ను పరిచయం చేసిన మేకర్స్

ఇటీవలే 'రామబాణం'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన మాచో స్టార్ గోపీచంద్.. ఇప్పుడు మరోసారి అభిమానుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. 'రామబాణం' మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత ఇప్పుడు గోపీచంద్ 'భీమా' మూవీతో వస్తున్నారు. ఇది గోపీచంద్ కెరీర్‌లో హీరోగా తెరకెక్కనున్న 31వ చిత్రం. ఈ మూవీతో కన్నడ డైరెక్టర్‌.. టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ డబుల్ అప్ డేట్స్ అందించారు. సినిమాలోని హీరోయిన్స్ ను ఎట్టకేలకు రివీల్ చేస్తూ.. వారి ఫస్ట్ లుక్ పోస్టర్ లను కూడా రిలీజ్ చేశారు.

'భీమా' మూవీలో ఒక హీరోయిన్ గా ప్రియా భవానీ శంకర్, మరొక హీరోయిన్ మాళవికా శర్మ నటిస్తున్నారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఇద్దరికి కూడా సినిమాలో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందని మేకర్స్ అంటున్నారు. ఇప్పటికే పలు తెలుగు చిత్రాల్లో నటించిన ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు.. టాలీవుడ్ లో పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ప్రియా భవానీ శంకర్ ఇటీవలే ‘కళ్యాణం కమనీయం’ అనే చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మాళవికా శర్మ కూడా రవితేజ, రామ్ లాంటి స్టార్లతో నటించి గుర్తింపును అందుకుంది. ఇప్పుడు వీరిద్దరు కలిసి కమర్షియల్ హీరో గోపీచంద్‌తో స్టెప్పులేయనున్నారు. పైగా ‘భీమా’ బడ్జెట్ విషయంలో మేకర్స్ ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగా లేరని సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘భీమా’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. అంతే కాకుండా ఈ మూవీ కోసం టాప్ టెక్నిషియన్స్‌లో బరిలోకి దించారు.

‘భీమా’ చిత్రానికి స్వామి జె గౌడ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ ఈ చిత్రంతో తెలుగులో అడుగుపెట్టనున్నాడు. రమణ వంక ప్రొడక్షన్ డిజైనర్ స్థానాన్ని తీసుకోగా.. కిరణ్ ఎడిటర్‌ బాధ్యతలు స్వీకరించాడు. అజ్జు మహంకాళి ‘భీమా’కు డైలాగులు అందిస్తున్నాడు. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఫైట్స్‌ను ఏకంగా నలుగురు ఫైట్ మాస్టర్లు కంపోజ్ చేస్తున్నారు. రామ్ లక్ష్మణ్‌తో పాటు వెంకట్, డాక్టర్ రవి వర్మ కూడా ‘భీమా’కు ఫైట్ మాస్టర్స్‌గా వ్యవహరిస్తున్నారు.


Tags

Next Story