Viswak Sen Laila : విశ్వక్ సేన్ కోసం పెంచల్ దాస్

Viswak Sen Laila :  విశ్వక్ సేన్ కోసం పెంచల్ దాస్
X

విశ్వక్ సేన్ సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. ప్రధానంగా ఎక్కువ శాతం తెలంగాణ స్లాంగ్ తో కనిపిస్తుంటాయి. అతను వేరే స్లాంగ్ ట్రై చేసినా ఈ వాసనలు అస్సలు పోవు. తక్కువ టైమ్ లోనే తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్న విశ్వక్ సేన్ ఫస్ట్ టైమ్ ల పూర్తి స్థాయి లేడీ గెటప్ తో నటించిన సినిమా ‘లైలా’. రీసెంట్ గా వచ్చిన టీజర్ తో అంచనాలు పెంచాడు. పాటా ఆకట్టుకుంది. అయితే తన శైలికి భిన్నంగా అతను రాయలసీమ ఫోక్ సింగర్ పెంచల్ దాస్ తో ఓ పాట పాడించాడు. దానికి సంబంధించి ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ లైలా మూవీలో పెంచల్ దాస్ ఓ పాట పాడాడు. అతని వాయిస్ కాస్త టిపికల్ గా ఉంటుంది. వినగానే జానపదం ఉట్టిపడుతుంది. పాడటమే కాక రాస్తుంటాడు కూడా. కృష్ణార్జున యుద్ధం మూవీతో ఫేమ్ అయిన పెంచల్ దాస్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల అరవింద సమేతతో బాగా హైలెట్ అయ్యాడు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లులో మాట వినాలి పాట రాసింది ఆయనే. తాజాగా ఈ లైలా మూవీ కోసం మరోసారి గళమెత్తాడు. ‘ఓహో రత్తమ్మా.. నాగా రత్తమ్మా.. నడకలో బల్బులకే’ అంటూ సాగే ఈ గీతాన్ని పాడటమే కాదు రాసింది కూడా పెంచల్ దాసే. ప్రోమో చూస్తుంటేనే మరో హిట్ సాంగ్ అనిపిస్తోంది.

ఇక రామ్ నారాయణ్ డైరెక్ట్ చేసిన లైలా ఫిబ్రవరి 14న విడుదల కాబోతోంది. విశ్వక్ సేన్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించాడు.

Tags

Next Story