BB4Muhurtham : బాలయ్య - బోయపాటి ముహూర్తం కుదిరింది

BB4Muhurtham :  బాలయ్య - బోయపాటి ముహూర్తం కుదిరింది
X

టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మాసివ్ కాంబినేషన్ అంటే ఈ తరంలో వినిపించే పేర్లు బాలకృష్ణ, బోయపాటి శ్రీను. వీరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ.. ఒకదాన్ని మించి ఒకటి బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. బోయపాటి లాస్ట్ మూవీ స్కంద బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. అయినా బాలయ్యతో మూవీ అంటే అతనికి ఏదో పూనకం వచ్చినట్టు కనిపిస్తాడు. బాలయ్యను తను తప్ప ఇంకెవరూ అంత మాస్ గా చూపించరు అనేలా చేస్తాడు. అందుకే ఈ కాంబో కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆ ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడినట్టే. అంతా ఎక్స్ పెక్ట్ చేస్తున్నట్టుగానే అఖండ 2 కు ముహూర్తం కుదిరింది.

ఈ బుధవారం ఉదయం 10 గంటలకు అఖండ 2 పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. అఖండ క్లైమాక్స్ ఫైట్ లో బాలయ్య తిప్పిన విష్ణు చక్రం లాంటిది మరోసారి కనిపిస్తుండటంతో ఇది సీక్వెలే అనుకుంటున్నారు. ఆ ఫైట్ లో పైన మహా శివుడి సాక్షాత్కారం కనిపించడం గ్రాఫిక్సే అయినా గూస్ బంప్స్ తెప్పించింది అందరికీ. అందుకే ఈ సీక్వెల్ పై భారీ అంచనాలుంటాయి. వాటిని అందుకోవడం అంత సులువేం కాదు. కాకపోతే కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ ను బట్టి.. ఖచ్చితంగా అందుకుంటారనే అనుకోవాలి.

ఇక14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించబోతోన్న సినిమా. లెజెండ్ తర్వాత వీరు బాలయ్యతో చేస్తోన్న మూవీ ఇది. సీక్వెల్ కాబట్టి ఫస్ట్ పార్ట్ లోని ఆర్టిస్ట్ లు రిపీట్ అవుతారా లేక ఇంకేదైనా కొత్త నేపథ్యంలో ఈ కథ చెప్పబోతున్నారా అనేది చూడాలి.

Tags

Next Story