O.G Trailer : ఓ.జి ట్రైలర్ డేట్ ఫిక్స్ చేశారు

O.G Trailer :  ఓ.జి ట్రైలర్ డేట్ ఫిక్స్ చేశారు
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓ.జి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. చాలామంది ఈ 18నే విడుదలవుతుంది అనే ప్రచారం చేశారు. కానీ ఇవాళ విడుదల కావడం లేదీ మూవీ ట్రైలర్. ఈ నెల 21న ఓ.జి ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. 21న ఉదయం 10.08 గంటలకు ట్రైలర్ చేస్తాం అని అనౌన్స్ చేశారు. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించాడు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించారు. ఇతర కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్ కనిపించబోతున్నారు. థమన్ సంగీతం అందించాడు.

ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కరడుగట్టిన గ్యాంగ్ స్టర్ గా నటించబోతున్నాడని ఇప్పటి వరకూ వచ్చిన అవుట్ పుట్ చూస్తే అర్థం అవుతుంది. కొన్నాళ్ల క్రితం వచ్చిన టీజర్ లో ఇచ్చిన ఎలివేషన్స్ తో పాటు రీసెంట్ గా వచ్చిన పాటలు చూస్తే గన్స్ తో గట్టిగానే పని ఉండేలా ఉంది. 1980 -90 ల నేపథ్యంలో సినిమా సాగుతుందని ప్రియాంక ఇంటర్వ్యూస్ లో చెబుతోంది. సో.. ఆ కాలంలో ముంబైని వణికించిన ఓ.జి అనే వ్యక్తి కథ అనుకోవచ్చు. మొత్తంగా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత పెద్దగా గ్యాప్ లేకుండానే సినిమా కూడా 25నే రిలీజ్ కాబోతోంది. సో.. ఈ దసరా హాలిడేస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు తిరుగులేని జాలీ డేస్ గా మారతాయా లేదా అనేది చూడాలి.

Tags

Next Story