Ajithi Vidamuyarchi : విడాముయర్చి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే

Ajithi Vidamuyarchi :  విడాముయర్చి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే
X

ఒక స్టార్ హీరో సినిమా వాయిదా పడితే.. అది కూడా సంక్రాంతి లాంటి పెద్ద పండగ టైమ్ లో పోస్ట్ పోన్ అయితే మిగతా అందరికీ కలిసొస్తుంది. అదే టైమ్ లో ఆ హీరో ఫ్యాన్స్ వల్ల నిర్మాణ సంస్థలకు తిట్లు తప్పవు. ప్రస్తుతం కోలీవుడ్ లో ఇదే కనిపిస్తోంది. కోలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకడైన అజిత్ నటించిన విడాముయర్చిని సంక్రాంతికి విడుదల చేస్తాం అన్నారు. బట్ ఆ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు న్యూ ఇయర్ కు ముందు రోజు ప్రకటించింది నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్. దీంతో మరో నాలుగు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ డేట్ పోస్టర్స్ వేసుకున్నాయి. అదీ స్టార్ హీరో కెపాసిటీ అంటే అనుకోవచ్చు.

మరోవైపు అజిత్ ఫ్యాన్స్ అంతా లైకా ప్రొడక్షన్స్ ను ఓ రేంజ్ లో తిట్టి పోస్తున్నారు. చేతగానప్పుడు ఎందుకు రిలీజ్ చేస్తాం అని ప్రకటించాలి అంటూ సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. ఒకవేళ ఈ చిత్రం రాకపోయి ఉంటే.. ఆల్రెడీ చివరి దశలో ఉన్న అజిత్ మరో మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వచ్చేది కదా అంటూ తిడుతున్నారు. అదే టైమ్ లో ఇప్పుడు పోతే పోయింది.. కనీసం కొత్త డేట్ అయినా చెప్పండి అంటున్నారు. వారి కోసమే ఈ అప్డేట్.

విడాముయర్చిని జనవరి 31న విడుదల చేయాలనుకుంటున్నారని సమాచారం. ఒకవేళ అప్పుడూ కుదరకపోతే ఫిబ్రవరి 7న అనుకుంటున్నారట. ఇదీ తేడా కొడితే వాలెంటైన్స్ డే కు వస్తుంది. అదీ మేటర్. అంటే ఇప్పటికీ నిర్మాణ సంస్థకు కొత్త డేట్ అనౌన్స్ చేసే ధైర్యం చాలడం లేదు. మరి ఎందుకు ఈ సమస్య అంటే.. కోలీవుడ్ లోనే పెద్దదైన లైకా ప్రొడక్షన్స్ వారికీ ఫైనాన్సియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయట. ఆ కారణంగానే ఈ మూవీ వాయిదా పడిందీ అంటున్నారు. సో.. ఈ గ్యాప్ లో ఆర్థిక సమస్యలు సాల్వ్ అయితే అప్పుడు డేట్ వేస్తారు. ఆ డేట్ 31 లేదా ఫిబ్రవరి 7 లేదంటే 14 అనేది తర్వాత తెలుస్తుందన్నమాట.

Tags

Next Story