Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్, అశ్విని రేవంత్.. లవ్‌స్టోరీ

Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్, అశ్విని రేవంత్.. లవ్‌స్టోరీ
Puneeth Rajkumar: అశ్వినిని తమ జీవితంలోకి స్వాగతించడం పట్ల పునీత్ కుటుంబం సంతోషంగా ఉంది.

Puneeth Rajkumar: పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో అక్టోబర్ 29న బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య అశ్విని రేవంత్, ఇద్దరు కుమార్తెలు ధృతి, వందిత ఉన్నారు. పునీత్ ఆకస్మిక మరణం అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు, మరీ ముఖ్యంగా అతని అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

పునీత్‌కి అశ్వినితో పెళ్లయి 20 ఏళ్లు అయింది. వీరిది ప్రేమ వివాహం.



పునీత్, అశ్విని ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఒకరినొకరు కలుసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరూ స్నేహితులుగా మారారు. ఎనిమిది నెలల పాటు స్నేహితులుగా ఉన్న తర్వాత పునీత్‌కి అశ్వినీపై తనకు ఉన్నది స్నేహం కాదని, అంతకంటే ఎక్కువే అని తెలుసుకున్నాడు. తన ప్రేమను ఆమె ముందు వ్యక్త పరిచాడు. పెళ్లి చేసుకునేందుకు అంగీకారమైతే చెప్పమన్నాడు. ఇరువురి అభిప్రాయాలు, ఆలోచనలు ఒకేలా ఉన్నాయని ఎనిమిది నెలల పరిచయంలో తెలుసుకున్న ఆమె.. పునీత్ ప్రపోజల్‌ని వెంటనే అంగీకరించింది. వారి స్నేహం చివరికి ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది.

అశ్వినిని తమ జీవితంలోకి స్వాగతించడం పట్ల పునీత్ కుటుంబం సంతోషంగా ఉంది. అయితే, అశ్విని కుటుంబం మాత్రం మొదట ఒప్పుకోలేదు. కొన్ని నెలలు వారి అంగీకారం కోసం వేచి చూశారు. ఆరు నెలల తర్వాత ఎట్టకేలకు అశ్విని కుటుంబం పునీత్‌ని తమ ఇంటి అల్లుడుగా చేసుకోవడానికి ఒప్పుకున్నారు. దాంతో పునీత్ రాజ్‌కుమార్, అశ్విని రేవంత్‌ల వివాహం డిసెంబర్ 1, 1999న అంగరంగ వైభవంగా జరిగింది.

పునీత్ తన ప్రేమకథ గురించి మాట్లాడినప్పుడు



ఓ ఇంటర్వ్యూలో, పునీత్ రాజ్‌కుమార్ తన తల్లిదండ్రులతో అశ్విని గురించి మాట్లాడటానికి భయపడ్డానని చెప్పాడు. ఇలాంటి విషయాల గురించి నేనెప్పుడూ అంత స్వేచ్ఛగా, బహిరంగంగా వారితో మాట్లాడలేదు. మా నాన్నగారి ముందు నిలబడి నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పడం అదే మొదటిసారి. ఆయన ఒప్పుకుని మా అమ్మ అంగీకారం కూడా తీసుకోమన్నారు. దాంతో మా పెళ్లి అయింది అని తన ప్రేమ వివాహం గురించి చెప్పుకొచ్చారు పునీత్.

పునీత్ రాజ్‌కుమార్ ప్రముఖ కన్నడ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్, పార్వతమ్మ చిన్న కుమారుడు. కర్ణాటక అంతటా భారీ అభిమానులను సంపాదించుకున్న ఆయన హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం అభిమానులను తీవ్రంగా కలచి వేస్తోంది.

పునీత్ రాజ్‌కుమార్‌ని పెళ్లి చేసుకోవడం గర్వంగా ఉంది

పునీత్‌కి కుటుంబం నేర్పిన ప్రేమ, ఆప్యాయత, సహజీవనం తనను ఆశ్చర్యపరిచాయని, రాజ్‌కుమార్ కుటుంబంలో ఒకరిని పెళ్లి చేసుకున్నందుకు గర్వంగా ఉందని ఓ సందర్భంలో అశ్విని రేవంత్ కూడా చెప్పుకొచ్చారు.

Tags

Next Story