Anushka Shetty : అమ్మో అనుష్క ఇంత భయపెట్టేసిందేంటీ..

Anushka Shetty :  అమ్మో అనుష్క ఇంత భయపెట్టేసిందేంటీ..
X
'The Queen' Anushka Shetty's GHAATI Glimpse is here

స్వీటీ బ్యూటీ అనుష్క శెట్టి బర్త్ డే సందర్భంగా ఆమె నటిస్తోన్న కొత్త సినిమా ‘ఘాటీ’ నుంచి వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఘాటీ నుంచి ఉదయం అనుష్క పోస్టర్ విడుదల చేశారు. ఈవెనింగ్ ఈ వీడియో గ్లింప్స్ ను విడుదల చేశారు. మామూలుగా క్రిష్ ప్రస్తుతం ఫామ్ లో లేడు కాబట్టి.. ఈ మూవీ సాధారణంగానే ఉంటుందనుకున్నారు. బట్ గ్లింప్స్ చూస్తే సినిమాను చాలా భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు అని అర్థం అవుతోంది. ఓ స్టార్ హీరో మూవీ రేంజ్ లో కినిపిస్తోందీ గ్లింప్స్ చూస్తుంటేనే.

ఆంధ్రా ఒడిషా బోర్డర్ లో సాగే కథ ఇది. అక్కడి ఘాటీల మీదుగా అనేక అక్రమ రవాణాలు జరుగుతుంటాయి. ప్రధానంగా గంజాయి రవాణా టెంపో లారీల నుంచి రైల్లలో దేశం దాటి మరీ పోతుంది. ఇదంతా ఓ పెద్ద దందా. ఈ దందా కారణంగా లాస్ అయిన ఓ బాధితురాలు.. తర్వాత తనే ఓ క్రిమినల్ గా మారి ఆ ముఠాలను అంతం చేసి ఆ ప్రాంతానికే ఓ లెజెండ్ లా మారే కథ అని ముందు నుంచీ చెబుతున్నారు. ఈ గ్లింప్స్ లోనే ఆ మొత్తం కంటెంట్ అర్థం అవుతోంది.

బట్ గ్లింప్స్ లో అనుష్క.. ఓ బస్ లోకి ఎక్కి ఓ వ్యక్తి గొంతును కోస్తూ అత్యంత కర్కశంగా కనిపిస్తోంది.ఆ షాట్ చూస్తే చాలు.. ఈ పాత్రను తనుఎంత ఓన్ చేసుకుందో తెలియడానికి. తనకు పర్సనల్ గా అరుంధతి, పంచాక్షరి, భాగమతి తర్వాత అంతకు మించిన సినిమా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags

Next Story