Game Changer : గేమ్ ఛేంజర్ రేంజ్ మారుతోంది

Game Changer :  గేమ్ ఛేంజర్ రేంజ్ మారుతోంది
X

రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి ప్రధాన పాత్రల్లో శంకర్ డైరెక్ట్ చేసిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి బరిలో జనవరి 10న విడుదల కాబోతోంది. మొన్నటి వరకూ ఈ మూవీపై పెద్దగా అంచనాలు లేవు అనే చెప్పాలి. ఫ్యాన్స్ లో కూడా ఓ నిరుత్సాహం కనిపించింది. ఆ మధ్య యూఎస్ లో చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ పెద్దగా హైలెట్ కాలేదు. బట్ తాజాగా విజయవాడ ఈవెంట్ తో ఒక్కసారిగా టాప్ లోకి దూసుకువచ్చింది గేమ్ ఛేంజర్. గేమ్ ఛేంజర్ నుంచి రామ్ చరణ్ ఉన్న ప్రపంచంలోనే అత్యంత పెద్ద కటౌట్ ను లాంచ్ చేశారు ఈ ఈవెంట్ లో. ఇలాంటి కటౌట్ ఇప్పటి వరకూ ఏ హీరోకూ పెట్టలేదు. అయితే ఇందుకోసం మూవీ టీమ్ అంతా వస్తుందనుకోలేదు చాలామంది. బట్ మొత్తం టీమ్ వచ్చింది. రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు, థమన్, అంజలి వీళ్లు చెప్పిన మాటలకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. మూవీ ష్యూర్ షాట్ అనేలా ఉన్నాయి వీరి స్పీచ్ లు.

రామ్ చరణ్ కు ఇది ప్రిస్టీజియస్ మూవీ. ఆర్ఆర్ఆర్ తర్వాత చేస్తోన్న సినిమా కావడంతో పాటు రాబోయే రోజుల్లో గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ను మరింత పెంచుకోవాలంటే శంకర్ డైరెక్షన్ లో రూపొందిన ఈ మూవీతో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలి. అందుకే మొదట పెద్ద బజ్ క్రియేట్ కాకపోయేసరికి ఫ్యాన్స్ కొంత ఇబ్బంది పడ్డారు. బట్ సినిమా లైన్ లో పడుతోంది. రిలీజ్ కు ముందే జనవరి 1న ట్రైలర్ రాబోతోంది. ఆ ట్రైలర్ తో సినిమా రేంజ్ ఏంటో అర్థం అవుతుంది. అలాగే 4న రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు. అంటే ఇంక చెప్పేదేముందీ.. మూవీకి ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అవుతుంది. దీంతో ఆటో మేటిక్ గా భారీ ఓపెనింగ్స్ వస్తాయి. మొత్తంగా గేమ్ ఛేంజర్ కటౌట్ నుంచి కలరింగ్ మారిపోయిందని చెప్పాలి.

Tags

Next Story