Maa Elections 2021 : మా ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో పోలింగ్‌కు వాళ్లే కారణమా?

Maa Elections 2021 : మా ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో పోలింగ్‌కు వాళ్లే కారణమా?
Maa Elections 2021 : మా చరిత్రలోనే లేని విధంగా ఈసారి ఓటింగ్ జరిగింది.

Maa Elections 2021 : మా చరిత్రలోనే లేని విధంగా ఈసారి ఓటింగ్ జరిగింది. ఎప్పుడూ నాలుగైదు వందలకు మించని ఓటింగ్ ఈసారి.. రికార్డ్ స్థాయిలో నమోదైంది. మా చరిత్రలోనే ఎక్కువగా పోలింగ్ జరిగింది ఈసారే. దాదాపు 905 మంది సభ్యులు ఉండగా.. చెల్లుబాటు అయ్యే ఓట్లు మాత్రం 883. అందులో మొత్తం 605 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. మరో 60 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటును ఉపయోగించుకున్నారు.

గత మా ఎన్నికల్లో కూడా ఇన్ని ఓట్లు పోలవ్వలేదు. అప్పుడు 474 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఈసారి మా ఎన్నికలకు బాగా హైప్ వచ్చింది. రెండు ప్యానళ్లు... పోటాపోటీగా ప్రచారం చేయడంతో భారీగా ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా కీలకం కావడంతో వాటిపైనా సభ్యులు శ్రద్ధ తీసుకున్నారు. అందుకే అవి కూడా భారీగానే వచ్చాయి. ఈసారి రికార్డ్ స్థాయిలో 83 శాతం పోలింగ్ జరిగింది.

పోలింగ్ మధ్యాహ్నం రెండు గంటల వరకే అని చెప్పినా.. కొంతమంది సభ్యులు ఆ సమయంలోపు పోలింగ్ బూత్ దగ్గరకు చేరుకోలేకపోయారు. మరికొందరు వచ్చే అవకాశం ఉండడంతో.. రెండు ప్యానళ్లకు చెందిన మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ తో మాట్లాడారు. దీంతో పోలింగ్ సమయాన్ని మరో గంట పాటు పొడిగించడానికి నిర్ణయించారు. అందుకే మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ కు అనుమతించారు.

మొత్తానికి మా ఎన్నికల్లో ప్రచారం అయితే పీక్స్ కు చేరినా.. ఆ సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలు మాత్రం.. సినీ అభిమానులను గాయపరిచాయి. పోలింగ్ రోజున యాక్టర్లంతా కలిసి మెలిసి ఉన్నట్టుగా హావభావాలు చూపించడం, హగ్ చేసుకోవడం, షేక్ హ్యాండ్ లు ఇచ్చుకోవడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. మధ్యలో పోలీసుల ఓ సందర్భంలో హీరోల అభిమానులపై లాఠీఛార్జ్ చేయడంతో పరిస్థితి గందరగోళంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story