Hari Hara Veera Mallu : అసలు సినిమా ముందుంది

ఓ మూడేళ్లుగా తెలుగు సినిమా వేసవి సీజన్ ను మిస్ చేసుకుంటోంది. స్టార్ హీరోలు రావడం లేదు. వచ్చిన వాళ్లు విజయాలు సాధించడం లేదు. దీంతో ఇంత పెద్ద సీజన్ లో సరైన వినోదం లేక ప్రేక్షకులు కూడా బోర్ ఫీలవుతున్నారు. ఈ సమ్మర్ కూడా అదే పరిస్థితి కనిపించింది. మార్చి చివరి వారం నుంచి చాలా సినిమాలు వచ్చాయి. ఓమూడు నాలుగు తప్ప హిట్అని చెప్పుకున్న చిత్రాలే లేవు. దీంతో ఈ వేసవి కూడా నిరాశేనా అనుకుంటున్నారు చాలామంది. బట్ ఈ సారి అలా ఏం కాదు. ఈ సమ్మర్ ఇంకా అయిపోలేదు. కాకపోతే కాస్త మాన్ సూన్ వరకూ సినిమాలు విస్తరించి ఉన్నాయి. ఈ నెలాఖరున 30న భైరవం విడుదలవుతోంది. పెద్ద హీరోలు కాకపోయినా పెద్ద వినోదాన్ని పంచే అవకాశం ఉన్నవాళ్లే వీళ్లు. రీమేక్ అయినా తెలుగు ఆడియన్స్ టేస్ట్ కు తగ్గ మార్పులు కనిపిస్తున్నాయి. ట్రైలర్ విడుదలైతే అంచనాలు మొదలవుతాయి.
ఇక జూన్ 5న లోక నాయకుడు కమల్ హాసన్ మెయిన్ లీడ్ లో శింబు, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ వంటి భారీ తారాగణంతో మణిరత్నం తెరకెక్కించిన థగ్ లైఫ్ విడుదల కాబోతోంది. 35యేళ్ల తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో రూపొందిన సినిమా ఇది. అందుకే రెండు రాష్ట్రాల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ గ్యారెంటీ హిట్ అనే టాక్ వినిపిస్తోంది.
జూన్ 12న మోస్ట్ అవెయిటెడ్ మూవీగా చెప్పుకున్న హరిహర వీరమల్లు విడుదలవుతోంది. దాదాపు ఈ మూవీ ఐదేళ్లుగా సాగుతూ వచ్చింది. ఫైనల్ గా అఫీషియల్ రిలీజ్ డేట్ పోస్టర్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిరీక్షణకు ఎండ్ కార్డ్ వేశారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఔరంగజేబ్ కాలం నాటి కంటెంట్ తో రాబోతోన్న ఈ మూవీతో డిప్యూటీ సిఎమ్ కు ఎలాగైనా భారీ హిట్ ఇవ్వాలన్న కోరికతో ఉన్నారు ఫ్యాన్స్.
జూన్ 20న కుబేర విడుదల కాబోతోంది. నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ మూవీ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. శేఖర్ కమ్ముల ఫస్ట్ టైమ్ స్టార్స్ తో వర్క్ చేసిన మూవీ ఇది. అందుకే ఆయన అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. నిజానికి 2024 డిసెంబర్ లోనే విడుదలవుతుందన్నారు. మరి ఏమైందో కానీ.. చాలా దూరం వచ్చింది. చివరికి జూన్ 20 నుంచి ఆడియన్స్ ను అలరించబోతోంది కుబేర.
జూన్ 27న విష్ణు మంచు టైటిల్ పాత్రలో నటించి నిర్మించిన కన్నప్ప విడుదల కాబోతోంది. భక్త కన్నప్పగా నలభైయేళ్ల క్రితమే వచ్చిన సినిమాను ఈ టెక్నాలజీని జోడించి కాస్త ఫిక్షన్ గా కూడా మలిచి విష్ణు రూపొందిస్తోన్న సినిమా ఇది. మామూలుగా విష్ణు ఖాతాలో ఇది మరో సినిమాగా ఉండేది. కానీ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, మోహన్ బాబు అంటూ ఇండియాలోనే టాప్ స్టార్స్ ను రంగంలోకి దించాడు. వారివి చిన్న పాత్రలే అయినా.. సినిమాకు చాలా పెద్ద హెల్ప్ అవుతారు అనేది నిజం. అందుకే కన్నప్పపైనా అంచనాలున్నాయి.
ఇక ఫినిషింగ్ టచ్ అనేలా విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ జూలై 4న విడుదల కాబోతోంది. ఈ నెల 30నే విడుదల అన్నారు. కానీ సడెన్ గా పోస్ట్ పోన్ చేశారు. ఈ మూవీపైనా భారీ అంచనాలున్నాయి. సితార బ్యానర్ లో గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నాడు.
సో.. నిజానికి ఈ మూవీస్ సమ్మర్ లోనే వచ్చేసి ఉంటే ఓ రేంజ్ లో ఉండేది. కానీ టెక్నికల్ ప్రాబ్లమ్సా.. లేక ఇంకేవైనా సమస్యలా అనేది చెప్పలేం కానీ.. కాస్త ఆలస్యంగా వస్తున్నా.. ఆడియన్స్ కు మాత్రం సమ్మర్ మూవీ ఫ్లేవర్ నే అందించబోతున్నారు. అంచేత పిక్చర్ అభీ బాకీ హై అన్నమాట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com