VV Vinayak : వినాయక్ ఆరోగ్యంపై రూమర్స్.. వార్నింగ్ ఇచ్చిన టీమ్

ఒకప్పటి స్టార్ మాస్ డైరెక్టర్ వివి వినాయక్.. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. మారిన ట్రెండ్ ను పట్టుకోలేకపోవడం వల్ల ఆయన సినిమాలన్నీ పోతున్నాయి. అందుకే డైరెక్షన్ కు రెస్ట్ ఇచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. కాస్త లావుగా ఉంటాడు కదా. అందుకే ఆ మధ్య సన్నబడేందుకు ప్రయత్నాలు కూడా చేశాడు. అఫ్ కోర్స్ అవన్నీ తను హీరోగా నటించే సినిమా కోసమే అన్నాడు. ఆ సినిమా ఆగిపోయింది. ఆయనా తర్వాత వెయిట్ లాస్ ను పట్టించుకోలేదేమో. కాకపోతే ఎప్పుడూ హుషారుగానే ఉంటారు. నవ్వుతూనే మాట్లాడతాడు కదా. అయితే రీసెంట్ గా కొన్ని రోజులు హాస్పిటలైజ్ అయ్యాడు. దీంతో రకరకాల రూమర్స్ వచ్చాయి. బట్ అవన్నీ జస్ట్ రెగ్యులర్ చెకప్స్ అన్నారు. అయినా మరోసారి ఆయన ఆరోగ్యం విషమంగా ఉందంటూ కొన్ని ప్రసార మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని ఆయన టీమ్ తీవ్రంగా ఖండించింది.
‘‘ప్రముఖ దర్శకులు వి వి వినాయక్ గారు ఆరోగ్యం పై కొన్ని మాధ్యమాలలో వస్తున్న వార్తలు అవాస్తవం. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా వున్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా వాస్తవాలు తెలుసుకొని ప్రచురించాలి అని మనవి.ఇకపై ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకొనబడును
ఇట్లు
వి వి వినాయక్ టీమ్’’
అంటూ ఒక లెటర్ విడుదల చేశారు. ఏదైనా నిజాలు తెలుసుకునే ఓపిక అస్సలెవరికీ ఉండటం లేదీ మధ్య. చిన్న వార్త రాగానే దానికి చిలవలు పలవలుగా మారుస్తున్నారు. ఈ కారణంగా చాలామంది సెలబ్రిటీస్ ఇబ్బంది పడ్డారు కూడా. సో.. ఏదైనా కాస్త తెలుసుకుని న్యూస్ గా మారిస్తే బెటర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com