Allu Arjun : సంధ్య థియేటర్ ఘటన కేవలం ప్రమాదం మాత్రమే

పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తోపులాటో మరణించిన రేవతి ఘటనలో అల్లు అర్జున్ పై కేస్ నమోదైంది. కోర్ట్ నుంచి ఆయన బెయిల్ తీసుకుని ఉన్నాడు. ఓ రెండు వారాలుగా తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ ఇష్యూ బర్నింగ్ టాపిక్ గా ఉంది. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో సైతం ఈ ఘటన గురించి.. అల్లు అర్జున్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా మాట్లాడాడు. అల్లు అర్జున్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ముందు నుంచీ చెబుతున్నాడు రేవంత్ రెడ్డి. అయితే దీనిపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెడుతున్నా అని చెప్పినప్పుడు ఎంటైర్ తెలుగు మీడియా, పీపుల్ కూడా అతనేం చెబుతాడా అని ఎదురుచూశారు.
ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ ఎలాంటి ఘాటు వ్యాఖ్యలూ చేయలేదు. ఈ కేస్ కోర్ట్ పరిధిలో ఉంది కాబట్టి.. ఆ ఘటన గురించి కాకుండా కేవలం తన వ్యక్తిత్వంపై చేస్తోన్న విమర్శలు బాధించాయని చెప్పాడు. తను నిర్లక్ష్యంగా ఉన్నాను అనేది నిజం కాదు. ఆ రోజు థియేటర్ కు చాలా దగ్గరలోనే పోలీస్ ల సూచన మేరకు.. కార్లో నుంచి బయటకు వచ్చి అభిమానులకు హాయ్ చెప్పానని అలా చెప్పకపోతే వాళ్లు కదలరని ఇది చాలాసార్లు జరిగింది.. నాకే కాదు పొలిటీషియన్స్ విషయంలోనూ ఇది జరుగుతుందన్నాడు.
"థియేటర్ లో నేనేదో కామెంట్స్ చేశాను అని చెప్పడం అది నా క్యారెక్టర్ అసాసినే. ఆ కారణంగానే ఇలా స్పందిస్తున్నాను. ఈ ఇన్సిడెంట్ పూర్తిగా ఓ ప్రమాదం. ఏ వ్యక్తీ ఇందులో ఇన్వాల్వ్ కాలేదు. ఎవరికీ సంబంధం లేదు. కానీ నా ప్రిమిసిస్ లో జరిగింది కాబట్టి బాధ్యత తీసుకున్నాను.. నాకు ఆ విషయం నెక్ట్స్ డే తెలిసిందనీ.. వెంటనే హాస్పిటల్ కు వెళదాం అనుకున్నా. కానీ అప్పటికే నా పై కేస్ నమోదైందనీ.. అందుకే రావొద్దని బన్నీ వాస్ చెప్పాడు. అయినా ప్రతి గంటకూ ఆ బాబు హెల్త్ అప్డేట్స్ తెలుసుకుంటున్నాను. అయినా జరిగిన అంశాలు నన్ను ఎంత బాధించినా.. ఇంత పెద్ద విజయం సాధించిన నా సినిమా విజయాన్ని, సెలబ్రేషన్స్ ను క్యాన్సిల్ చేసుకున్నాను. నేను ఏ వ్యక్తినీ ఉద్దేశించి చెప్పడం లేదు. కానీ నా గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో వారికి సరైన ఇన్ఫర్మేషన్ లేదని చెబుతున్నాను. నేను వెంటనే స్పందించలేదు అనడం అబద్ధం.
ఆ కుటుంబానికి పర్మనెంట్ గా ఏదో ఒకటి చేయాలని నేను సుకుమార్, నిర్మాణ సంస్థ నుంచి ఆలోచన చేస్తున్నాం. ఎంత చేసినా పోయిన ప్రాణం తేలేము. కానీ మాకు చేతనైంతగా ఆ కుటుంబానికి అండగా నిలవాలనుకున్నాం. నేను వెళ్లకపోవడానికి కారణం మా లాయర్లు వద్దు అని చెప్పడమే తప్ప నేను నిర్లక్ష్యంగా లేను. ఆ కుటుంబం గురించి, బాబు గురించి నిరంతరం నా టీమ్ నుంచి బన్నీ వాస్, సుకుమార్ గారు, ఆయన భార్య, నిర్మాణ సంస్థ ప్రతి ఒక్కరూ వెళ్లి బాబు ఆరోగ్యం గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. అయినా నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం తీవ్రంగా బాధించింది. నాకూ అదే వయసు ఉన్న బాబు ఉన్నాడు. నేనెందుకు అంత నిర్లక్ష్యంగా ఉంటాను. దయచేసి నా వ్యక్తిత్వాన్ని భంగపరిచే వ్యాఖ్యలు చేయొద్దని వేడుకుంటున్నాను. మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకూడదు. ఇలా చేయడం వల్ల లీగల్ ఇష్యూస్ వస్తాయి. దాని వల్ల నాకు ఇంకా సమస్యలు పెరుగుతాయి అంటూ మీడియా ప్రశ్నలకు తర్వాతెప్పుడైనా సమాధానం చెబుతాను.. " అంటూ ఇదే విషయాన్ని నేషనల్ మీడియా కోసం ఇంగ్లీష్ లో కూడా వివరించాడు. మరి దీనిపై ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com