Game Changer : గేమ్ ఛేంజ‌ర్‌ సెకండ్ సాంగ్ ప్రోమో డేట్ వచ్చేసింది

Game Changer :  గేమ్ ఛేంజ‌ర్‌ సెకండ్ సాంగ్ ప్రోమో డేట్ వచ్చేసింది
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ మీదున్న అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. 2024 క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.

‘గేమ్ ఛేంజ‌ర్‌’ అప్‌డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్‌, ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. వారి కోసమే మేక‌ర్స్ మ‌రో క్రేజీ అప్‌డేట్‌ను ఇచ్చేశారు. సెప్టెంబ‌ర్ 28న సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘రా మ‌చ్చా మ‌చ్చా’ ప్రోమో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు అనౌన్స్ చేశారు. ప‌ల్ల‌విలోని లైన్స్ చూస్తుంటే.. మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ త‌మ‌న్ నుంచి ప‌క్కా మాస్ బీట్ సాంగ్ ఆడియెన్స్‌ను అల‌రించ‌బోతుంద‌ని అర్థ‌మ‌వుతుంది. ఈ పాట‌ను అనంత్ శ్రీరామ్ రాశారు.

ఇప్ప‌టికే ‘గేమ్ చేంజర్’ నుంచి వచ్చిన ‘జరగండి జరగండి..’పాట ఎంత సెన్సేష‌న్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. ఈ సెకండ్ సాంగ్‌కు అప్‌డేట్ ఫ్యాన్స్‌తో పాటు, ప్రేక్ష‌కుల్లోనూ స‌రికొత్త ఎన‌ర్జీనిచ్చింది. విన‌య విధేయ రామ చిత్రంలో జోడీగా మెప్పించిన రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ.. గేమ్ ఛేంజ‌ర్‌లో అల‌రించ‌టానికి రెడీ అయ్యారు. ఈ క్యూట్ పెయిర్ సంద‌డిని సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడాల‌నే ఉత్సాహం అంద‌రిలోనూ క‌నిపిస్తోంది. ఇయ‌ర్ ఎండింగ్‌లో క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్ టు న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ అన్నీ మావే అనే కాన్ఫిడెన్స్ క‌నిపిస్తోంది గేమ్ ఛేంజ‌ర్ యూనిట్ లో.

లార్జ‌ర్ దేన్ లైఫ్ చిత్రాల‌ను అబ్బుర‌ప‌రిచే రీతిలో తెర‌కెక్కించే శంకర్ ఇప్ప‌టి వ‌ర‌కు తెర‌కెక్కించిన సినిమాల‌ను మించేలా ‘గేమ్ ఛేంజ‌ర్‌’ను రూపొందిస్తున్నారు.

Tags

Next Story