Lucky Baskhar : గద్దర్ అవార్డ్స్ లో అదరగొట్టిన లక్కీ భాస్కర్

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ లో లక్కీ భాస్కర్ సత్తా చాటింది. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ చిత్రాన్ని వెంకీ అట్లూరి డైరెక్ట్ చేశాడు. సితార, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్ నిర్మించాయి. 2024లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.100 కోట్లకు పైగా వసూలు చేసింది. వెంకీ అట్లూరి స్క్రీన్ ప్లేతో పాటు రైటింగ్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. బ్యాంకింగ్ సెక్టర్స్ లో జరిగే మోసాలు, షేర్ మార్కెట్ విశేషాలను సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చెబుతూ సింపుల్ రైటింగ్ తో మెప్పించాడు దర్శకుడు. అఫ్ కోర్స్ ఇందులో షేర్ మార్కెట్ లో పండిపోయిన వారి సలహాలూ, సూచనలు కూడా తీసుకునే రాసుకున్నాడు. అందుకే ఇంకా నేచురల్ గా కనిపించాయి.
ఇక ఈ బుధవారం ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ లో లక్కీ భాస్కర్ ఏకంగా నాలుగు అవార్డ్స్ గెలుచుకుంది. థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ లో అవార్డ్ గెలుచుకుంది. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా వెంకీ అట్లూరి, స్పెషల్ జ్యూరీ అవార్డ్ 1 గా దుల్కర్ సల్మాన్, బెస్ట్ఎడిటర్ గా నవీన్ నూలి పురస్కారాలు గెలుచుకున్నారు. మరి ఫస్ట్ అవార్డ్స్ లోనే నాలుగు గెలుచుకోవడం అంటే చిన్న విషయం కాదు కదా.. అందుకే మనం కూడా వారికి కంగ్రాట్యులేషన్స్ చెప్పాలి కదా..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com