NTR : ఎన్టీఆర్ మంగుళూరు ట్రిప్.. ఇదన్నమాట సంగతి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సడెన్ గా మంగుళూరు వెళ్లడం టాలీవుడ్ లో చర్చనీయాంశం అయింది. పైగా ఎయిర్ పోర్ట్ లో అతను కాంతార హీరో, దర్శకుడు రిషబ్ శెట్టిని కలిశాడు. దీంతో అక్కడ ఏం జరుగుతుందా అన్న క్లారిటీ లేక కన్ఫ్యూజ్ అయ్యారు ఫ్యాన్స్. వారి కోసమే ఈ న్యూస్. ఎన్టీఆర్ కుటుంబ సమేతంగా ఈ రోజు (శనివారం ) ఉదయమే మంగుళూరు వెళ్లారు. అక్కడి నుంచి ఉడిపికి చేరుకుని శ్రీ కృష్ణ టెంపుల్ లో ఆశిస్సులు అందుకున్నారు. రాబోయే దేవరతో పాటు తర్వాతి ప్రాజెక్ట్స్ కోసమే తల్లి, భార్యతో కలిసి అక్కడ బ్లెస్సింగ్స్ అందుకున్నారు. విశేషం ఏంటంటే.. ఈ ట్రిప్ లో కేవలం రిషబ్ మాత్రమే కాదు.. ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ వెంటే ఉన్నాడు. రిషబ్ దగ్గరుండి అన్నీ చూసుకున్నట్టుగా వీడియోలు వైరల్ గా మారాయి. తర్వాత తీరిగ్గా ఉడిపిలోని లోకల్ హోటెల్ లో ముగ్గురూ కలిసి లంచ్ చేస్తోన్న ఫోటో సోసల్ మీడియాను షేక్ చేస్తోందిప్పుడు. సో.. ఉడిపి వెళ్లింది శ్రీ కృష్ణుడి ఆశిస్సులతో పాటు ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ గురించి మరింత డిస్కషన్స్ చేసేందుకు అన్నమాట.
ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ ఓ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ను చేయబోతున్నాడు. ఆల్రెడీ ఓపెనింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎన్టీఆర్ జనవరి నుంచి షూటింగ్ లో జాయిన్ అవుతాడు. అదీ మేటర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com