Pawan Kalyan : రవితేజ మాస్ జాతరకి పవన్ కళ్యాణ్ కి సంబంధం ఏంటీ..?

రవితేజ హీరోగా నటిస్తోన్న సినిమా మాస్ జాతర. భాను భోగవరపు డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో శ్రీ లీల హీరోయిన్. ధమాకా తర్వాత రవితేజతో కలిసి శ్రీ లీల నటిస్తోన్న రెండో సినిమా ఇది. ఇద్దరి ఎనర్జీ ధమాకాలో సూపర్ గా వర్కవుట్ అయింది. అది ఈ సారి కూడా రిపీట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. లేటెస్ట్ గా వచ్చిన గ్లింప్స్ చూస్తే ఇది కూడా కంప్లీట్ గా రవితేజ మార్క్ మాస్ ఎంటర్టైనర్ అనిపిస్తోంది. మాస్ రాజా పోలీస్ పాత్రలో మరోసారి కనిపించబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ వినిపిస్తోంది.
నిజానికి ఈ బ్యానర్ లో రవితేజ జాతిరత్నాలు దర్శకుడితో సినిమా చేయాలి. కానీ ఆ దర్శకుడిని మాస్ రాజా చాలాకాలం పాటు వెయిట్ చేయించి హ్యాండ్ ఇచ్చాడని టాక్. అయితే నిర్మాణ సంస్థ మాత్రం రవితేజతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉంది. అందుకు కారణం ఆల్రెడీ అతనికి అడ్వాన్స్ ఇచ్చి మూడు నాలుగేళ్లు కావడమే. యస్.. ఆ టైమ్ లో అడ్వాన్స్ ఇవ్వడానికి కారణం పవన్ కళ్యాణ్ చేసిన ఓ సినిమా కావడం విశేషం. చూడ్డానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. ఆ సినిమా భీమ్లా నాయక్.
మళయాలంలో బ్లాక్ బస్టర్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ ను తెలుగులో ముందుగా బాలకృష్ణ, గోపీచంద్ తో రీమేక్ చేయాలనుకున్నారు. కానీ ఇద్దరూ వదులుకున్నారు. ఆ టైమ్ లోనే రానా, రవితేజలతో చేయాలని సితార బ్యానర్ అనుకుంది. ఈ ఇద్దరూ అందుకు ఒప్పుకున్నారు కూడా. అప్పుడు రవితేజకు సితార బ్యానర్ అడ్వాన్స్ ఇచ్చింది. కట్ చేస్తే ఈ కథ గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్.. పోలీస్ పాత్రలో తను నటిస్తానని ముందుకు వచ్చాడు. అలా రవితేజ పక్కకు వెళ్లిపోయాడు. పవర్ స్టార్ ఎంట్రీతో భీమ్లా నాయక్ మరింత పవర్ ఫుల్ గా తయారైంది.
మామూలుగా హీరోలకు ఇచ్చిన అడ్వాన్స్ లు మళ్లీ వెనక్కి రావు. మంచి కథలు సెట్ చేసుకుని నిర్మాతలే మరో సినిమాతో ముందుకు వెళ్లాలి. అలా ఆ అడ్వాన్స్ కోసం అనుదీప్ దర్శకత్వంలో రవితేజతో సినిమా అనుకున్నారు. కుదర్లేదు. ఇప్పుడు భాను భోగవరపును దర్శకుడుగా పరిచయం చేస్తూ మాస్ జాతర రూపొందుతోంది. అదీ మేటర్. అప్పుడు పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వకపోయి ఉంటే.. భీమ్లా నాయక్ లో రవితేజ ఉండేవాడు. ఇప్పుడు మాస్ జాతర వచ్చేదో లేదో గెస్ చేయలేం అన్నమాట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com