Rajamouli RRR : మరోసారి కలుస్తోన్న ఆర్ఆర్ఆర్ టీమ్

Rajamouli RRR :  మరోసారి కలుస్తోన్న ఆర్ఆర్ఆర్ టీమ్
X

ఆర్ఆర్ఆర్.. హిస్టరీని ఫిక్షన్ గా మార్చి రాజమౌళి రూపొందించిన ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన విజయం దక్కింది. రాజమౌళి స్ట్రాంగ్ పిల్లర్స్ అయిన యాక్షన్ త పాటు ఎమోషన్ నూ గొప్పగా బ్లెండ్ చేసిన విధానానికి వాల్డ్ వైడ్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనకు ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇద్దరూ కెరీర్ బెస్ట్ అనే రేంజ్ లో పర్ఫార్మ్ చేశారు. నాటు నాటు పాటలోని డ్యాన్స్ ప్రపంచాన్నే ఊపేసింది. జపాన్ లో నూ విడుదలైన ఈ చిత్రం ఏకంగా అక్కడ 100 రోజులు ఆడింది.ఎలా చూసినా ఆర్ఆర్ఆర్ తో తెలుగు సినిమా పతాకాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టారు రాజమౌళి అండ్ టీమ్.

ఇక ప్రస్తుతం వ్యక్తిగతంగా ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన ముచ్చట్లన్నీ ముగిసిపోయాయనే అనుకుంటున్న టైమ్ లో ఈ టీమ్ మళ్లీ కలుస్తోంది. బట్ సీక్వెల్ కోసం కాదు.మే 11న లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో జరగబోతోన్న ఫిల్హార్మానిక్ లైవ్ కాన్సర్ట్ లో ఈ టీమ్ పార్టిసిపేట్ చేయబోతోంది. ఈ కాన్సర్ట్ లో రాజమౌళితో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి కూడా పాల్గొనబోతున్నారు. ఆ కాన్సర్ట్ అనంతరం ఆడియన్స్ తో ఇంటరాక్షన్ కూడా ఉంటుందట. ఆ ఇంటరాక్షన్ లో నలుగురూ పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో.. ఈ మూవీ ఆడియోకు సంబంధించిన అక్కడ మరిన్ని విశేషాలు పంచుకోబోతున్నారన్నమాట.

Tags

Next Story