AGADHA TEASER : అగధ టీజర్ అదిరిపోయిందిగా

AGADHA TEASER :  అగధ టీజర్ అదిరిపోయిందిగా
X

ఎమ్ఎస్ రాజు అనగానే చాలామందికి స్టార్ ప్రొడ్యూసర్ గానే బాగా తెలుసు. కానీ దర్శకుడుగా కూడా ఆయన ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. దర్శకుడుగా ఫస్ట్ మూవీ వానతో బాగా ఇంప్రెస్ చేశాడు. తర్వాత కొన్ని మూవీస్ కూడా చేశాడు. రీసెంట్ గా డర్టీ హరితో కమర్షియల్ గా మంచి విజయం కూడా అందుకున్నాడు. కాకపోతే ప్రొడ్యూసర్ గా చాలా వైఫల్యాలు చూశాడు. అంతకు ముందు శతృవు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఆపై పౌర్ణమితో బాగా లాస్ అయ్యాడు. చివరగా మస్కాతో సరిపెట్టుకున్నాడు. ఇక ఇవన్నీ ఎందుకు అంటే అతను మళ్లీ మెగాఫోన్ పట్టుకుని తీసిన సినిమా ‘అగధ’. ఈ మూవీ టీజర్ విడుదలైంది.

అగధ టీజర్ చూడగానే చాలా ఇంప్రెసివ్ గా ఉంది అనిపిస్తుంది. మామూలుగా ఈ తరహా కథల్లో దేవుళ్లు, దెయ్యాలు, అతీంత్రియ శక్తులు, సూపర్ పవర్స్ అనేవి కామన్ గానే ఉంటాయి. బట్ అంతకు మించి ఇంకేదో ఉంది అనిపించేలా ఉంది టీజర్. టైటిల్ రోల్ లో మరో లేడీ ఉంటుంది అనిపించింది. ప్రస్తుతం అయితే కామాక్షి భాస్కర్ల మెయిన్ లీడ్ లో కనిపిస్తోంది. తను ఓ మంత్రగత్తెలా కనిపిస్తోంది. ఆమెతో పాటు డర్టీ హరిలో నటించిన హీరోగా నటించిన శ్రావణ్ రెడ్డి మేల్ లీడ్ గా కనిపిస్తున్నాడు. ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ తో పాటు భాను చందర్ కూడా ఓ కీలక పాత్రల్లో కనిపించబోతున్నాడు. అయితే ఈ మూవీలో మరో కీలకమైన పాత్రలో దేవి ఫేమ్ వనిత నటించింది. కాకపోతే టీజర్ లో తను కనిపించలేదు. ఓ రకంగా అగధగా ఆమే నటించిందని అర్థం అవుతోంది. టీజర్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చాలా బావుంది. లాస్ట్ షాట్ మాత్రం అదిరిపోయింది. కామాక్షిని కత్తితో పొడిచే షాట్ అది. బట్ ఆమె ఏ మాత్రం తడబడకుండా అలాగే ఉండిపోవడమే టీజర్ లో హైలెట్ గా ఉందని అర్థం అవుతోంది. మొత్తంగా ఎమ్ఎస్ రాజు కథ, దర్శకత్వం చేసిన ఈ చిత్రంతో అతను ఏ మేరకు ఆకట్టుకుంటాడో అనేది తెలియాల్సి ఉంది.

Tags

Next Story