Bhagyashree Borse : భాగ్యశ్రీకి కలిసిరాని కాలం

Bhagyashree Borse :  భాగ్యశ్రీకి కలిసిరాని కాలం
X

కాలం కలిసి రాని బ్యూటీ అంటే భాగ్యశ్రీ బోర్సే అని చెప్పాలి. అలా అని టాలెంట్ లేదా అంటే ఉంది. టాలెంట్ ఉంది.. అది ప్రదర్శించే అవకాశాలున్నాయి. బట్ హిట్ అనే మాట మాత్రం వినిపించడం లేదు. ఈ మాట కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు. కానీ ఆ మాటే తనకు సినిమా సినిమాకూ దూరం అవుతోంది. ఫస్ట్ మూవీ కాంత. కానీ ఆలస్యంగా విడుదలైంది. అంతకు ముందు మొదటగా విడుదలైన చిత్రంగా మిస్టర్ బచ్చన్ అనే మూవీ. ఈ చిత్రంలో తన ఎక్స్ పోజింగ్ చూసి చాలామంది మైండ్ బ్లోయింగ్ అనిపించారు. ఈ మూవీతో తన రేంజ్ కూడా మారుతుంది అనుకున్నారు. బట్ మూవీ డిజాస్టర్ గా మిగిలింది. సోకులారబోత మాత్రం మైనస్ అయింది. కట్ చేస్తే సెకండ్ మూవీగా కింగ్ డమ్ మూవీ గురించి చెప్పారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండకు కలిసొచ్చే కాలం అన్నారు. బట్ అదీ పోయింది. ఈ మూవీలో భాగ్యశ్రీకి కూడా పెద్దగా కలిసొచ్చిన సందర్భాలు కూడా ఏం లేవు. తన పాత్ర గొప్పగా లేదు. పాటలూ ఆకట్టుకునే లేదు.

ఇక ఫస్ట్ మూవీగా కాంత గురించి మాత్రం హాట్ టాపిక్ గా అయింది. కాంత బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనుకున్నారు. దుల్కర్ సల్మాన్ లాంటి నటుడుతో సినిమా అంటే మాగ్జిమం గ్యారెంటీ అన్నారు. పాత్రలు కూడా కొత్తగా ఉంటాయి అనుకున్నారు. బట్ ఈ మూవీ కూడా పోయింది. బట్ భాగ్యశ్రీ నటన మాత్రం హైలెట్ అనిపించుకుంది. అయినా ఉపయోగం లేకుండా పోయింది. ఇక తాజాగా ఆంధ్రాకింగ్ తాలూకా మూవీ గురించి.

ఆంధ్రాకింగ్ తాలూకా మాగ్జిమం ఒప్పించలేకపోయింది మూవీ. రామ్ పోతినేని ఈ మూవీ గురించి చాలా చెప్పాడు. చాలా నమ్మకం కూడా పెట్టాడు. కానీ ఆ నమ్మకం కూడా గోదావరిలో కలిసిపోయింది. సినిమా బావుంది అనే టాక్ వచ్చింది కానీ కలెక్షన్స్ కూడా లేవు అని నిర్మాతలు చెప్పారు. టాక్ ఉందీ అంటే కలెక్షన్స్ కూడా ఉన్నట్టే కదా. ఆ మినిమం మేటర్ కూడా వదులుకున్నారు. కట్ చేస్తే భాగ్యశ్రీకీ ఇదే పరిస్థితి. ఈ మూవీలో తన నటనకు మార్కులు పడ్డాయి. కానీ సినిమా నెగెటివ్ గా అయిపోయింది. సో.. ఈ చిత్రం కూడా పోయింది.

మొత్తంగా తన ఖాతాలో హిట్టే పడలేదు. మిస్టర్ బచ్చన్ పక్కన పెడితే తన స్కిన్ షోకూ దూరంగా కనిపించింది. యాక్టింగ్ పరంగా ఓకే అనిపించుకుంది. బట్ హిట్ పరంగా మాత్రం ఓకే అనిపించుకోలేకపోయింది. చూస్తుంటే తన ఖాతాలో మరో తెలుగు మూవీ రావడం కష్టమే అనిపిస్తోంది. మరి ఇలాంటి సందర్భాల్లో తమిళ్ లో చాలామంది విజయం సాధించారు ఆ తర్వాత తెలుగు మూవీస్ కు మళ్లీ వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. మరి ఆ ఛాన్స్ భాగ్యశ్రీకి వస్తుందో లేదో అనేది మాత్రం తెలియదు.

Tags

Next Story