Manchu Vishnu : మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆఫీసులో చోరీ..!

X
By - TV5 Digital Team |28 Feb 2022 7:15 AM IST
Manchu Vishnu : ఫిల్మ్‌నగర్‌లోని ఆయన ఆఫీసులో 5 లక్షల విలువ చేసే సామాగ్రిని దొంగలించడంతో.. మంచు విష్ణు మేనేజర్ సంజయ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు.
Manchu Vishnu : టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆఫీసులో చోరీ జరిగింది. ఫిల్మ్‌నగర్‌లోని ఆయన ఆఫీసులో 5 లక్షల విలువ చేసే సామాగ్రిని దొంగలించడంతో.. మంచు విష్ణు మేనేజర్ సంజయ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. బోరబండకు చెందిన యు.నాగశ్రీను హెయిర్ సైలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఈ నెల 17న జూబ్లీహిల్స్ లోని విష్ణు ఆఫీసులో రూ.5లక్షల విలువైన హెయిర్ డ్రెస్సింగ్, మేకప్ సామగ్రిని చెప్పకుండా, ఎలాంటి అనుమతి లేకుండా తీసుకెళ్లాడని విష్ణు మేనేజర్ సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసు పైన దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com