TheRanaDaggubati : బ్లాక్ బస్టర్ లుక్ తో కనిపిస్తోన్న రానా ట్రైలర్

ఈ మధ్య కాలంలో రానా సినిమాలేం చేయలేదు కదా.. ఈ ట్రైలర్ ఎక్కడి నుంచి వచ్చిందీ అనుకుంటున్నారా.. లేక ఈ మధ్య అతను చాలా సినిమాలు ప్రమోట్ చేస్తున్నాడు కాబట్టి.. ఆ మూవీస్ దేమో అనుకుంటున్నారా..? బట్.. అవేం కాదు. అతని కొత్త ‘షో’కు సంబంధించిన ట్రైలర్. చాలామందికి తెలుసు.. రానా మంచి హోస్ట్ అని. 2017లో ఐఫా ఉత్సవ్ ను హోస్ట్ చేశాడు. 2017 - 2021 వరకూ నెంబర్ వన్ యారీ అనే షోతో సూపర్ హిట్ కొట్టాడు. 2024లో రీసెంట్ గా మరోసారి ఐఫాను హోస్ట్ చేశాడు. ఇవన్నీ అద్బుతమైన టైమింగ్ అండ్ ఎనర్జీతో కనిపిస్తాయి. మరి అలాంటి రానా నుంచి మరో షో వస్తోందంటే ఖచ్చితంగా హైప్ ఉంటుంది కదా.. ఆ హైప్ ను డబుల్ చేస్తూ.. ట్రైలర్ కూడా వచ్చేసింది. ఇంతకీ ఇది ఏ ప్లాట్ ఫామ్ లో ఉండబోతోంది అనుకుంటున్నారు కదా.. ఇప్పటి వరకూ మూవీస్ తోనే ఆకట్టుకున్న అమెజాన్ ప్రైమ్ లో ఈ షో స్ట్రీమ్ కాబోతోంది.
ఈ ట్రైలర్ చూస్తే రొటీన్ గానే అనిపించినా.. ఇంకేదే మ్యాజిక్ ఉండబోతోంది అని అర్థం అవుతుంది. నాగ చైతన్య, శ్రీ లీల, సిద్ధు జొన్నలగడ్డ, రిషబ్ శెట్టి, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, నాని - ప్రియాంక మోహన్, తేజ సజ్జా, మీనాక్షి చౌదరి వంటి గెస్ట్స్ లో ఈ సీజన్ ఉండబోతోందని ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.
నాగ చైతన్యను నీ ఫ్యామిలీ ఎలా ఉండాలనుకుంటున్నావు అని అడిగితే.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అలాగే కొంతమంది పిల్లలు అని చైతూ సమాధానం చెప్పాడు. దీనికి కొంతమంది అంటే వెంకీ మామలా నలుగురా అని రానా అడగడం ఫన్నీగా ఉంది.
సిద్దు తనదైన శైలిలో అలరించాడు. దుల్కర్.. రానాను కాంతారలో నటిద్దాం పదా అని ఆటపట్టించాడు.
ఈ మొత్తం ప్రోమోలో హైలెట్ అలాగే సర్ ప్రైజింగ్ మేటర్ ఏంటంటే.. రానా భార్య మిహికా బజాజ్ కూడా ఓ ఎపిసోడ్ లో కనిపించబోతోంది. తన వైఫ్ ను ‘పెళ్లి తర్వాత నేను బెటర్ అయ్యాను అనుకుంటున్నావా’ అని ఓ ప్రశ్న అడిగాడు రానా. దానికి ‘అఫ్ కోర్స్.. నువ్వు పెళ్లి చేసుకుంది నన్ను కదా’ అని చెప్పడం.. దానికి రానా ఎక్స్ ప్రెషన్.. ఇవన్నీ బలే ఉన్నాయి. కాకపోతే ఇంతకు ముందులా టివిల్లో రాదీ షో. అమెజాన్ సబ్ స్క్రిప్షన్ ఉంటేనే చూడగలరు. ప్రస్తుతానికైతే ‘ద రానా దగ్గుబాటి షో’ అనే టైటిల్ తో ఉంది. ఇక అన్నిటికంటే.. ఈ షోకు సెన్సార్ సర్టిఫికెట్ ఉండటం. అది కూడా ‘యూ/ఏ’ఉండటం చూస్తే.. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనేలా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com