Vijay Sethupathi : కింగ్ డమ్ తర్వాత మూడు సినిమాలు

Vijay Sethupathi :  కింగ్ డమ్ తర్వాత మూడు సినిమాలు
X

విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మూవీ మరికొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. మామూలుగా శుక్రవారం విడుదలయ్యే సినిమాల్లో కొన్ని ఈ మధ్య ముందు రోజే రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఆ రోజు వచ్చిన సినిమా తర్వాత శుక్రవారం ఖాళీగా ఉంటుంది అనుకుంటారు చాలామంది. బట్ అలా ఏం లేదు. రెగ్యులర్ గా ఉండే ఫ్రైడే రిలీజెస్ ఈ సారి కూడా ఉన్నాయి. కింగ్ డమ్ ఈ గురువారం విడుదలవుతుంది. శుక్రవారం కూడా మూడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. కాకపోతే ఇవన్నీ చిన్న సినిమాలు. ఇందులోనూ రెండు డబ్బింగ్ మూవీస్.

ఫ్రైడే మూవీస్ తో కాస్త ఎక్కువ ఆకర్షించే సినిమా విజయ్ సేతుపతి, నిత్య మీనన్ జంటగా నటించిన ‘సార్ మేడమ్’. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించిన సినిమా. ఆల్రెడీ తమిళ్ లో గతవారమే విడుదలైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ శుక్రవారం తెలుగులో విడుదలవుతోంది. తాజాగా మీడియా మీట్ తో సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేశారు హీరో, హీరోయిన్, దర్శకుడు. విజయ్ సేతుపతికి తెలుగులో అభిమానులున్నారు. నిత్య ఎలాగూ తెలిసిన హీరోయిన్నే. కాబట్టి వీరికి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం లేకపోలేదు.

వీరితో పాటు తెలుగు నుంచి హెబ్బా పటేల్, ధనుష్ రఘుముద్రి, రేఖా నిరోషా ప్రధాన పాత్రల్లో థ్యాంక్యూ డియర్ అనే సినిమా విడుదలవుతోంది. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. డిఫరెంట్ కంటెంట్ లా కనిపిస్తోంది. కానీ పోస్టర్ వాల్యూ లేకపోవడం, ప్రమోషన్స్ చేయకపోవడం ఈ చిత్రానికి మైనస్.

ఇక మరోటి ‘ఉసురే’అనే చిత్రం. తమిళ్ నుంచి తెలుగులో డబ్ అయిందీ సినిమా. దీని గురించి కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. కాకపోతే మాజీ హీరోయిన్ రాశి హీరోయిన్ తల్లిగా నటించింది. ట్రైలర్ కూడా ఏమంత ఆసక్తిగా లేదు. సో.. ఈ మూడు సినిమాలూ శుక్రవారం విడుదలవుతున్నాయి. అయితే.. కింగ్ డమ్ కు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఈ మూడూ వాష్ అవుట్ అవుతాయని మాత్రం చెప్పొచ్చు.

Tags

Next Story