Suhas : దేవర ముందు గొర్రె పురాణం

టాప్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఆ ముందు వారం.. తర్వాతి వారం రావడానికి కూడా కొందరు వెనకాడుతుంటారు. బట్ కొందరు మాత్రం దూకుడుగా కనిపిస్తారు. అలా ఈ నెల 20న దేవరకు ముందు వారం గొర్రెపురాణం చెబుతా అంటూ వస్తున్నాడు సుహాస్. తను హీరో మెటీరియల్ కాకపోయినా బలమైన కథలను నమ్ముకుని విజయాలు సాధిస్తున్నాడు. అందుకే సుహాస్ సినిమా అంటే కొత్త కంటెంట్ గ్యారెంటీ అనే పేరు చాలా త్వరగానే వచ్చేసింది. నిజానికి హీరోగా అతని ఫస్ట్ మూవీ ‘కలర్ ఫోటో’ఏదో కాన్సెప్ట్ వల్ల ఆడింది.. లేదంటే సుహాస్ కు అంత సీన్ లేదు అన్నవాళ్లూ ఉన్నారు. అతను నిజంగా ఆ కాన్సెప్ట్స్ నే నమ్ముకున్నాడు. కొత్త పాయింట్స్ తో వస్తోన్న కొత్త దర్శకులకు తనే ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ గా మారాడు. అలా ఈ సారి గొర్రె పురాణం అనే సినిమాతో ఈ నెల 20న వస్తున్నాడు. లేటెస్ట్ గా విడుదలైన ఈ గొర్రె పురాణం ట్రైలర్ చూస్తే మరోసారి అతను యూనిక్ కాన్సెప్ట్ తోనే వస్తున్నట్టుగా అర్థ అవుతోంది. ఒక గొర్రె వలన రెండు మతాల మధ్య చిచ్చు రేగుతుంది. దీంతో ఆ గొర్రెను జైల్ లో పెడతారు. ఆ గొర్రెకు సుహాస్ కు ఉన్న సంబంధం ఏంటీ.. గొర్రె క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటీ అనేది కథలా ఉంది. మొత్తంగా దేవర రిలీజ్ కు ముందు సినిమాలేం లేవు అనుకున్న ఆడియన్స్ కు నేనున్నా అంటూ వస్తున్నాడు సుహాస్.
విశేషం ఏంటంటే.. ఆ తర్వాత రోజు అంటే ౨౧ న సిద్ధార్థ్ క్లాసిక్ మూవీ బొమ్మరిల్లును రీ రిలీజ్ చేస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ లో రూపొందిన ఈ మూవీతోనే దర్శకుడుగా పరిచయమైన భాస్కర్.. బొమ్మరిల్లు భాస్కర్ గా మారాడు. జెనీలియా నటనకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు ఈ మూవీ వల్ల. మరి రిలీజ్ అండ్ రీ రిలీజ్ లలో ఎవరిది అప్పర్ హ్యాండ్ అవుతుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com