Akhil Akkineni : బర్త్ డే బాయ్ అఖిల్ నుంచి ఎలాంటి సందడీ లేదే

Akhil Akkineni :  బర్త్ డే బాయ్ అఖిల్ నుంచి ఎలాంటి సందడీ లేదే
X

అక్కినేని అఖిల్ బర్త్ డే ఇవాళ. ఈ సందర్భంగా కాస్త హడావిడీ కనిపించాలి. కానీ అలాంటిదేం లేదు. అతనికి ఒక్క హిట్టు అయినా పడితే బావుండు అని అభిమానులతో పాటు ఇండస్ట్రీ నుంచి కూడా కొందరు కోరుకుంటున్నారు. అతనికి విజయం మాత్రం ఇప్పటికీ అందని ద్రాక్షలా అయిపోయింది. హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే 11యేళ్లు అవుతోంది. ఇన్నేళ్లైనా ఒక్క బ్లాక్ బస్టర్ లేకపోవడం కాస్త ఇబ్బందికరమే అని చెప్పాలి. అక్కినేని నాగేశ్వరరావు లాంటి దిగ్గజ నటుడికి మనవడు, కింగ్ నాగార్జున తనయుడుగా ఎంట్రీ ఇచ్చినా ఆ వారసత్వాన్ని నిలబెట్టే ప్రయత్నంలో ఇప్పటికీ సక్సెస్ రాకపోవడం విషాదమే అని చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇన్నేళ్లైనా ఇంకా ఉన్నాడు. లేదంటే ఎప్పుడో జనం లైట్ తీసుకునే ఉంటారు.

ప్రస్తుతం లెనిన్ అనే మూవీతో వస్తున్నాడు అఖిల్. ఈ మూవీ కాస్త ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. అతని లుక్, మేకోవర్ కొత్తగా ఉన్నాయి. కాస్త డీ గ్లామర్ పాత్రలోనే కనిపించబోతున్నాడు. మురళీ కిశోర్ అబ్బూరి అనే దర్శకుడు రూపొందిస్తున్న మూవీ ఇది. అతను ఇంతకు ముందు వినరో భాగ్యము విష్ణు కథతో ఆకట్టుకున్నాడు. అందుకే ఈ సారి గ్యారెంటీగా అఖిల్ హిట్ కొడతాడు అని భావిస్తున్నారు. అదీ కాక ఈ చిత్రాన్ని నాగార్జునతో పాటు నాగవంశీ కూడా నిర్మిస్తున్నారు. అది కూడా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఏదేమైనా ఈ బర్త్ డే స్పెషల్ గా ఏమీ విడుదల చేయలేదు. కేవలం ఓ పోస్టర్ తో సరిపెట్టారు. అంటే ఇదే రోజు అల్లు అర్జున్ బర్త్ డే కాబట్టే ఇది ఏమంత సందడిగా ఉండదు అని భావించారేమో. ఏదేమైనా ఈ లెనిన్ మూవీ జూన్ 26న విడుదల అని చెప్పారు. మరి ఈ లెనిన్ తో అక్కినేని అఖిల్ ఓ భారీ విజయాన్ని అందుకోవాలని కోరుకుంటూ టివి5 ఎంటర్టైన్మెంట్ తరఫు నుంచి అతనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుదాం.

Tags

Next Story