RRR Movie: బ్లాక్ బస్టర్ 'ఆర్ఆర్ఆర్'.. ముందుగా అనుకున్న హీరోలు ఎవరంటే..

RRR Movie: బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్.. ముందుగా అనుకున్న హీరోలు ఎవరంటే..
RRR Movie: ‘బాహుబలి’ తర్వాత ఓ భారీ మల్టీ స్టారర్ చిత్రాన్ని తెరకెక్కించాలని రాజమౌళి ముందు నుండే ప్లాన్ చేసుకున్నాడట

RRR Movie: రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' నేడు విడుదలయ్యి అంతటా పాజిటివ్ రివ్యూస్ అందుకుంటోంది. అయితే సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ముఖ్య కారణం రామ్ చరణ్, ఎన్‌టీఆర్ అని చూసిన చాలామంది ప్రేక్షకులు భావిస్తున్నారు. వీరిద్దరు ఆన్‌స్క్రీన్ ఫ్రెండ్‌షిప్ చూడడానికి చాలా బాగుందని, ఎమోషనల్ సీన్స్‌ను బాగా పండించారని ప్రశంసిస్తున్నారు. అయితే ముందుగా ఆర్ఆర్ఆర్ కోసం అనుకున్న హీరోలు రామ్ చరణ్, ఎన్‌టీఆర్ కాదని రచయిత విజయేంద్ర ప్రసాద్ రివీల్ చేశాడు.

'బాహుబలి' తర్వాత ఓ భారీ మల్టీ స్టారర్ చిత్రాన్ని తెరకెక్కించాలని రాజమౌళి ముందు నుండే ప్లాన్ చేసుకున్నాడట. అయితే హీరోలుగా ఎవరిని సెలక్ట్ చేయాలి అనే అంశాన్ని ఆలోచించకుండా కథ రాయడం మొదలుపెట్టాడట విజయేంద్ర ప్రసాద్. కొన్నిరోజుల తర్వాత హీరోలుగా ఎవరిని పెట్టాలన్న ఆలోచన మొదలయింట రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్‌కు.

రజినీకాంత్-అర్జున్, సూర్య-కార్తీ లాంటి పలువురు పేర్లను పరిశీలించాడట రాజమౌళి. అయితే తాను ఒక సినిమా తెరకెక్కించాలంటే కచ్చితంగా రెండు సంవత్సరాల సమయం పడుతుంది కాబట్టి.. ఆ రెండేళ్లు తనను నమ్మి, పాజిటివ్‌గా ఉండే హీరోలు కావాలనుకున్న రాజమౌళి.. చివరికి రామ్ చరణ్, ఎన్‌టీఆర్‌లను ఫైనల్ చేశాడట. ఆర్ఆర్ఆర్ చూసిన వారంతా ఈ పాత్రలు వీరిద్దరు తప్ప మరెవరూ చేయలేరని ప్రశంసిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story