Sukumar Pushpa 2 : పుష్ప 2 సెన్సార్ అభ్యంతరాలు ఇవే

Sukumar Pushpa 2 :  పుష్ప 2 సెన్సార్ అభ్యంతరాలు ఇవే
X

అల్లు అర్జున్, సుకుమార్ ల పుష్ప 2 సెన్సార్ పూర్తయింది. సెన్సార్ నుంచి ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. అంతా ఊహించినట్టుగానే ఈ చిత్ర నడివి 3.20 నిమిషాలు ఉంది. అచ్చంగా చూస్తే 3 గంటల 20 నిమిషాల 38 సెకన్లు అన్నమాట. మరి ఇంత నిడివితో వస్తోన్న వీరి ధైర్యం ఏంటో కానీ.. సినిమాపై ఎంత అంచనాలున్నాయో.. అంతే డివైడ్ టాక్ కూడా కనిపిస్తోంది. బట్ ఫస్ట్ డే బ్లాక్ బస్టర్ అన్న టాక్ తెచ్చుకుంటే ఆల్రెడీ అయిన 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ డబ్బులు వెనక్కి వచ్చినట్టే. మిక్స్ డ్ టాక్ వచ్చినా ఇబ్బందులు తప్పవు. అవేం లేకుండా పుష్పరాజ్ బాక్సాఫీస్ ను రూల్ చేస్తాడనే అనుకుంటున్నారు చాలా వరకూ.

ఇక సెన్సార్ నుంచి ఈ చిత్రానికి 5 చోట్ల అభ్యంతరాలు వచ్చాయి. మొదటి 1 గంట 21వ నిమషం వద్ద రండీ, 36వ నిమిషం వద్ద దెం.. ద్ది అనే బూతు పదాలున్నాయి. ఇందులో రండీ ప్లేస్ లో లపాకీ అనే పదం వాడుకోవడానికి అనుమతి వచ్చింది. రెండో పదాన్ని పూర్తిగా మ్యూట్ చేయమని చెప్పారు. 2.29 టైమ్ లో వెంకటేశ్వర్ అనే పదాన్ని భగ్వంతుడు అనే పదంతో రీ ప్లేస్ చేయమని సెన్సార్ నుంచి మార్పు వచ్చింది. అలాగే మూడో గంటలో 5వ నిమిషం వద్ద కాలిలోకి ఎగిరిన తెగిపడిన విలన్ కాలిని అలాగే చూపించకుండా సి.జితో కవర్ చేయమని చెప్పారు. అదే సీన్ లో కావొచ్చు 6వ నిమిషంలో విలన్ చెయ్యి నరికి చేతిలో పట్టుకునే సీన్ ను కట్ అయిన పార్ట్ వద్ద జూమ్ ఇన్ చేయమని చెప్పారు. ఈ మేరకు ఆ మార్పులన్నీ అంగీకరించింది టీమ్. అందుకే యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది.


ఇక విడుదలకు చాలా తక్కువ టైమ్ ఉంది కాబట్టి.. బుక్ మై షోతో పాటు అన్ని ఆన్ లైన్ టికెట్ సెల్లింగ్ పోర్టల్స్ ఓపెన్ అవుతాయి. ఆల్రెడీ బుక్ మై షో, పేటిఎం లలో మిలియన్, మిలియన్ న్నర కు పైగా ఇంట్రెస్ట్ లు చూపించారు ప్రేక్షకులు. ఫైనల్ గా పుష్ప 2 - ద రూలింగ్ కు ఇంక అంతా సిద్ధం అన్నమాట.

Tags

Next Story