Anaganaga Oka Raju : ఈ వారం ఓటిటి మూవీస్ ఇవే

Anaganaga Oka Raju  :  ఈ వారం ఓటిటి మూవీస్ ఇవే
X

థియేటర్స్ లో సందడి చేసిన సినిమాలైనా హిట్ కొట్టకపోయిన మూవీస్ అయినా ఓటిటిలో విడుదల అంటేనే అదో రకమైన క్రేజ్ కనిపిస్తోంది. సమ్ టైమ్స్ థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అయిన మూవీస్ ఓటిటిలో లాస్ అయిన సందర్భాలున్నాయి. అదే టైమ్ లో థియటర్స్ లో లాస్ అయిన మూవీస్ ఓటిటిలో పాస్ అయిపోతుంటాయి. లేదా రెండు సందర్భాల్లోనూ బ్లాక్ బస్టర్ అయిన మూవీస్ కూడా ఉంటాయి. అలా ఈ వారం విడుదల కాబోతున్న ఓటిటి మూవీస్ ఏంటీ అంటే...

మన శంకర వరప్రసాద్ గారు.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ మూవీ.. ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది. భారీ వసూళ్లు కూడా వచ్చాయి. పైగా ఇంకా థియేటర్స్ లోనూ సత్తా చాటుతోందీ మూవీ. అలాంటి మూవీ ఈ నెల 11 నుంచి ఓటిటిలో స్ట్రీమ్ కాబోతోంది. జీ5 లో ఈ మూవీ స్ట్రీమ్ కాబోతోంది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో వెంకటేష్ చేసిన కేమియో ప్లస్ అయింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశాడు. అతనే సంక్రాంతి విన్నర్ గా పేరు తెచ్చుకున్నాడు కూడా.

అనగనగా ఒక రాజు.. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌధరి జంటగా నటించిన మూవీ. ఇది కూడా థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అయింది. 100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. ఓవర్శీస్ లో కూడా విజయం సాధించింది. అలాంటి మూవీని నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ చేయబోతున్నారు. ఈ నెల 11నుంచి ఈ మూవీ ఓటిటిలో స్ట్రీమ్ కాబోతోంది. పూర్తిగా గ్రామీణ వాతావరణంలో రూపొందిన ఈ మూవీ ఓటిటి నుంచి ఎలాంటి అప్లాజ్ అందుకుంటుందో చూడాలి.

ఇక శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ సంప్రదాయని సుప్పిని సుద్దపూస. సుధీర్ శ్రీరామ్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. అయితే ఇది థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా ఓటిటిలో విడుదలవుతోంది. చిత్తూరులో జరిగే కథలాగా ఉంది. క్రైమ్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా ఇది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా కనిపిస్తోంది. ఈ మూవీ ఈటీవి విన్ లో ఈ నెల 12నుంచి స్ట్రీమ్ కాబోతోంది.

కథా సుధ సిరీస్ లో భాగంగా ఈటివి విన్ లోనూ వరుససగా మూవీస్ వస్తున్నాయి. కంటెంట్ ను బట్టి కథల నిడివి తక్కువగా ఉండేలా వీళ్లు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ‘గోల్డ్ అండ్ గీత’అనే షార్ట్ ఫిల్మ్ ఈ నెల 8 నుంచే స్ట్రీమ్ అవుతోంది. మొత్తంగా వీటితో పాటు ఇతర భాషల్లోనూ మరికొన్ని మూవీస్ ఈ వారం నుంచి ఆయా ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమ్ కాబోతున్నాయి.

Tags

Next Story