Funky Movie : ఈ వారం ఓటిటి మూవీస్ ఇవే

థియేటర్స్ లో మెప్పించినా మెప్పించకపోయినా ఓటిటిల్లో వస్తోన్న మూవీస్ కు మంచి ఆదరణే వస్తోంది. ఏవో కొన్ని సినిమాల విషయంలో తప్ప మిగతావన్నీ బానే ఉన్నట్టుగా అనిపిస్తుంటాయి. అలా ఈ వారం విడుదల కాబోతోన్న ఓటిటిలో మూవీస్ లిస్ట్ చూస్తే గట్టిగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు నుంచి తక్కువగానే వస్తున్నాయి. తమిళ్ లో కాస్త ఎక్కువగా వస్తున్నాయి. మరి ఈ లిస్ట్ లో ముందు చూసే మూవీ అంటే.. భర్తలకు మహాశయులకు విజ్ఞప్తి.
1. రవితేజ హీరోగా అషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించిన మూవీ భర్తలకు మహాశయులకు విజ్ఞప్తి. కిశోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ మూవీ జీ5లో ఈ నెల 13 నుంచి స్ట్రీమ్ కాబోతోంది. విడుదలైన రెండు నెలల తర్వాతే ఈ మూవీ ఓటిటిలోకి వస్తోంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో స్ట్రీమ్ అవుతుందీ మూవీ.
2. విశ్వక్ సేన్, కయాడు లోహర్ జంటగా నటించిన మూవీ ఫంకీ. ఈ మూవీ గత నెల 13న విడుదలైంది. థియేటర్స్ నుంచి బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. అనుదీప్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో విడుదల చేస్తున్నారు. ఈ నెల 13 నుంచి ఫంకీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది. తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ తో పాటు హిందీలోనూ స్ట్రీమ్ కాబోతోంది.
3. శివ కందుకూరి, తేజూ అశ్విని జంటగా నటించిన మూవీ నవాబ్ కేఫ్. మొదట చాయ్ వాలాగా టైటిల్ అనుకున్నారు. సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ మార్చారు. ప్రమోద్ హర్ష డైరెక్ట్ చేసిన ఈమూవీ ఈటీవి విన్ లో స్ట్రీమ్ కాబోతోంది. ఓన్లీ తెలుగులోనే ఈ మూవీ అందుబాటులో ఉంటుంది.
4. ప్రియాంక అరుళ్ మోహన్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ్ మూవీ మేడ్ ఇన్ కొరియా. ఇది ఓన్లీ ఓటిటిలోనే విడుదలవుతోంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 12నుంచి స్ట్రీమ్ కాబోతోందీ మూవీ. ట్రైలర్ అయితే బావుంది. తమిళ్ తో పాటు తెలుగు, మళయాలం, కన్నడ తో పాటు హిందీలోనూ ఈ మూవీ స్ట్రీమ్ కాబోతోంది.
5. అజయ్ ధిషన్, ఆర్కే ధనుషా, పాండిరాజ్, సునిల్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ్ మూవీ పూకీ. గత నెల 13న విడుదలైందీ మూవీ. ఈ నెల 13 నుంచి జీ5లో స్ట్రీమ్ కాబోతోంది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా అందుబాటులో ఉంటుందీ మూవీ.
6. విజయ్ కుమార్, తలైవాసల్ విజయ్, కీర్తి అమర్, దర్శన శ్రీపాల్ గోలేచ ప్రధాన పాత్రల్లో నటించి తమిళ్ వెబ్ సిరీస్ రిసార్ట్. ప్రవీణ్ బెనెట్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ జియో హాట్ స్టార్ లో ఈ నెల 13నుంచి స్ట్రీమ్ కాబోతోంది. తమిళ్ తో పాటు తెలుగు, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమ్ కాబోతోంది ఈ సిరీస్.
7. రిషికాంత్, అబ్దూల్ లీ, మౌరిష్ దాస్, చిన్ని జయంత్, రిని, ఆర్ పాండియరాజన్, అద్వైత ఆర్ముగమ్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ లోకల్ టైమ్స్. నవీన్ జార్జ్ థామస్ డైరెక్ట్ చేశాడు. మొత్తం 7 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ ఉండబోతోంది. ఈ నెల 13 నుంచి ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతోంది. కేవలం తమిళ్ లోనే ఇది స్ట్రీమ్ కాబోతోంది.
8. నవీన్ కస్తూరియా, సన్ని హిందుజా, జతిన్ గోస్వామి, అభిలాష్ తపిల్యాల్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ సిరీస్ అస్పిరంట్స్. అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 13నుంచి ఈ అస్పిరంట్స్ అనే సిరీస్ స్ట్రీమ్ కాబోతోంది. దీపేష్ సుమిత్ర జగదీష్ దర్శకుడు. హిందీతో పాటు తమిళ్, తెలుగులోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంటుంది.
మొత్తంగా ఈ వారం విడుదల కాబోతున్న ఓటిటి మూవీస్ అండ్ సిరీస్ లు ఇవి. మరి వీటిలో దేనికి ఎక్కువ ఆదరణ లభిస్తుందో చూడాలి.
Tags
- Funky Movie
- Bhartha Mahasayulaku Wignyapthi OTT Release Date
- Viswak Sen
- Ravi Teja
- Ashika Ranganath
- Nawab Cafe Movie OTT Date
- Etv Win
- Amazon Prime
- Netflix
- JioHotstar
- Pookie OTT Date
- Made In Korea Tamil Movie
- Priyanka Arul Mohan
- Resort Tamil Web Series
- Local Times Tamil Web Series
- Aspirants : Season 3 ( Hindi)
- Shiva Kandukuri
- OTT Movies
- Tollywood
- TV5 Entertainment
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
