Kethika Sharma : అందగత్తెలకు కలిసిరాని ‘ఐటమ్స్’

Kethika Sharma :  అందగత్తెలకు కలిసిరాని ‘ఐటమ్స్’
X

ఆఫర్స్ లేని హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ చేయడం.. అందులో ఆరబోసిన అందాలతో కొత్త ఆఫర్స్ తెచ్చుకోవడం అనేది కామన్ గా చూస్తున్నాం. ఈ భామలు కూడా అంతే. హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. సినిమాలు ఆడలేదు. దీంతో ఆఫర్స్ తగ్గాయి. కట్ చేస్తే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోజులతో ఆకట్టుకోవడం మొదలుపెట్టారు. ఆ హాట్ నెస్ మా ఐటమ్ కు అవసరం అనుకున్న మేకర్స్ ఆఫర్స్ ఇచ్చారు. అలా కేతిక శర్మ అనే బ్యూటీ రీసెంట్ గా వచ్చిన రాబిన్ హుడ్ లో అదిదా సర్ ప్రైజ్ అంటూ హాట్ టాపిక్ అయింది. అలాగే మ్యాడ్ స్క్వేర్ లో ప్రియాంక ఝవాల్కర్ కూడా అదే స్థాయిలో రెచ్చిపోయింది. ఈ ఇద్దరి ఐటమ్ సాంగ్స్ సినిమాలకు ఏ మాత్రం ప్లస్ కాలేదు. కాకపోతే కేతిక పాట కాంట్రవర్శీ కావడంతో తాను హైలెట్ అయింది. ఇటు ప్రియాంక్ సాంగ్ కంటే మ్యాడ్ స్క్వేర్ లో కామెడీకే ఎక్కువ మార్కులు పడ్డాయి.

ఈ రెండు ఐటమ్ సాంగ్స్ ఆ ఇద్దరు హీరోయిన్లకు కొత్తగా తెచ్చిన ఆఫర్లేమీ లేవు. అయితే కేతిక శర్మ ఈ పాటకంటే ముందే శ్రీ విష్ణు సరసన సింగిల్ మూవీకి కమిట్ అయింది. అదేమైనా హిట్ అయితే అమ్మడికి ఆఫర్స్ వస్తాయేమో కానీ.. ఈ ఐటమ్ అస్సలు ప్లస్ కాలేదు.

ఇక ప్రియాంక పరిస్థితి కాస్త వేరు. అందం ఉంది. అది ఆరబోసేందుకు అభ్యంతరాలూ లేవు. అయినా సినిమాలు ఆడకపోవడంతో ఆఫర్స్ రావడం లేదు. ఆ మధ్య డిజే టిల్లు స్క్వేర్ లో కాసేపు హాట్ గా మెరిసింది. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ లో ఐటమ్ తో పాటు ఓ చిన్న పాత్ర కూడా చేసింది. ఈ రెండూ తనకు కొత్తగా ఒరగబెట్టిందేం లేదు. మళ్లీ హాట్ ఫోటో షూట్స్ తో కొత్త ఐటమ్స్ తెచ్చుకోవాల్సిన పరిస్థితే వచ్చింది.

Tags

Next Story