సినిమా

Tollywood 2021: వెండితెరపై తళుక్కుమన్న తారలు.. హవా కొనసాగేనా..

Tollywood 2021: ఈ ఏడాది కూడా పదుల సంఖ్యలో కొత్త కథానాయికలు తెరపైకి వచ్చారు.

Tollywood 2021: వెండితెరపై తళుక్కుమన్న తారలు.. హవా కొనసాగేనా..
X

Tollywood 2021: తెలుగు సినీ పరిశ్రమలో కథానాయికలకు అవకాశం ఎప్పుడూ వుంటుంది. అందం, అభినయం ఉంటే ఇక్కడ సక్సెస్ అవ్వడంతో పాటు అభిమానుల హాట్ ఫేవరేట్ కూడా అవ్వొచ్చు. కానీ ఈ లిస్టులో చేరడం అంత తేలిక కాదు. ఏటా పదుల సంఖ్యలో కొత్త తారలు తెరపై కనిపించినా అందులో సక్సెస్ అయ్యే హీరోయిన్ల శాతం చాలా తక్కువ. ఈ ఏడాది కూడా పదుల సంఖ్యలో కొత్త కథానాయికలు తెరపైకి వచ్చారు. వాళ్ళలో కొంత మంది ఒక్క సినిమాతోనే పాపులారిటీ తెచ్చుకుని వరుస ఆఫర్లు దక్కించుకుంటుంటే...మరికొందరు ఛాన్సుల కోసం వెయిట్ చేస్తున్నారు.

2021లో టాలీవుడ్లో అడుగుపెట్టిన కొత్త హీరోయిన్లలో కృతి శెట్టి పేరు ముందుగా చెప్పాలి. మొదటి సినిమా ఉప్పెనతో ఒక ఉప్పెనలా దూసుకొచ్చింది. ఫస్ట్ లుక్ రిలీజ్ నుంచే కృతిపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీలోని నీకళ్ళు నీలి సముద్రం అనే పాట విడుదలైన తర్వాత యూత్ లో కృతికి ఒక్కసారిగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక సినిమా విడుదలైన తర్వాత యూత్ ఆడియన్స్ ని బాగా ఎట్రాక్ట్ చేసింది. ఉప్పెన వంద కోట్ల క్లబ్ లో చేరడంలో కృతి గ్లామర్ కూడా ఓ కారణంగా చెప్పొచ్చు.

ఒక్క కన్నుగీటుతో వైరల్ గా మారిన భామ ప్రియ ప్రకాష్ వారియర్. మొదటి సినిమా విడుదల కాకుండానే సోషల్ మీడియాలో ఆమె పేరు సంచలనంగా మారింది. ఆమె నటించిన మలయాళం సినిమా ఓరు అదార్ లవ్ లో వింక్ సీన్ సోషల్ మీడియాని షేక్ చేసింది. సినిమా మాత్రం ఫ్లాఫ్ అయింది. అయితే ఈ ఏడాది తెలుగులో తెరంగేట్రం చేసింది ప్రియా. కానీ ఆ రెండూ నిరాశనే మిగిల్చాయి.ఈ ఏడాది మరో నట వారసురాలు వెండితెర ఎంట్రీ ఇచ్చింది. అద్భుతం సినిమాతో శివాని రాజశేఖర్ ప్రేక్షకులకు పరిచయమైయింది. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా శివాని నటనకు మంచి మార్కులు పడ్డాయి. శివాని స్క్రీన్ ప్రజన్స్, టైమింగ్ ఆకట్టుకున్నాయి. నటనకు ఆస్కారం వుండే పాత్రలకు బావుంటుందనే నమ్మకాన్ని ఇచ్చింది శివాని.

చిన్న చిన్న క్యారెక్టర్లతో ప్రేక్షకులకు పరిచయం అయిన అమృత అయ్యర్... ఈ ఏడాది 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే మూవీతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమాలో తన నటనతో మెప్పించింది అమృత అయ్యర్. ఇప్పుడు శ్రీవిష్ణు హీరోగా రూపొందిన అర్జున ఫల్గుణ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందంతో పాటు యాక్టింగ్ టాలెంట్ కూడా ఉన్న అమృత అయ్యర్ కి ఫ్యూచర్ లో మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది.

సో ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా టాలీవుడ్లో చాలా మంది కొత్త హీరోయిన్లు అడుగుపెట్టారు. వారిలో కొంత మంది సక్సెస్ అందుకుంటే మరికొంత మంది ఫ్లాపులు అందుకున్నారు. కొంత మంది అవకాశాలతో దూసుకుపోతుంటే...మరికొంత మంది ఛాన్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. వీరందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతూ...హ్యాపీ న్యూ ఇయర్.

Next Story

RELATED STORIES