Thudarum : ఈ వారం ఓటిటిలోకి మూడు ఇంట్రెస్టింగ్ మూవీస్

Thudarum :  ఈ వారం ఓటిటిలోకి మూడు ఇంట్రెస్టింగ్ మూవీస్
X

కొన్ని సినిమాలు థియేటర్స్ లో దుమ్మురేపిన తర్వాత కూడా ఓటిటిలో చూడాలనుకునే ఆడియన్స్ బాగా ఉంటారు. అలాంటి మూవీస్ కు రిపీట్ వ్యూయింగ్ వాల్యూ కూడా ఉంటుంది. ఆ సినిమాల కోసం ఎక్కువగా ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. అలా ఈ వారం మూడు ఇంట్రెస్టింగ్ మూవీస్ ఓటిటిలో సందడి చేయబోతున్నాయి. ఇవన్నీ డిఫరెంట్ జానర్స్ లో వచ్చి ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన సినిమాలే.

ఈ నెల 29న నాని నటించిన హిట్ 3 నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నాని సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్. హిట్ మూవీ ఫ్రాంఛైజీలో వచ్చిన ఈ థర్డ్ కేస్ చాలా వయొలెంట్ గా ఉంది. ఓ రకంగా వెండితెరపై రక్తం ఏరులై పారింది. నాని ఇమేజ్ కు భిన్నంగా ఉందని కొన్ని కమెంట్స్ వచ్చినా.. ఆర్టిఫిషియల్ వయొలెన్స్ అన్న విమర్శలు వచ్చినా సినిమా బాక్సాఫీస్ వద్ద సెంచరీ కొట్టేసింది. మరి ఇలాంటి మూవీ ఇప్పుడు ఓటిటి ఆడియన్స్ నుంచి ఎలాంటి అప్లాజ్ అందుకుంటుందో చూడాలి.

మళయాలంలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన తుడరుమ్ ఈ 30 నుంచి ఓటిటిలోకి రాబోతోంది. మోహన్ లాల్, శోభన జంటగా నటించిన తుడరుమ్ అనూహ్యంగా చాలా అంటే చాలా పెద్ద విజయం సాధించింది. ఇతర భాషల్లోనూ డబ్ చేశారు. అన్ని చోట్లా మంచి టాక్ సంపాదించుకుంది. తెలుగులో ప్రమోషన్స్ లేకపోవడం వల్ల ఎక్కువ ఆడియన్స్ కు రీచ్ కాలేదు. అయితే మళయాలంలో అనేక రికార్డులు బద్ధలు కొట్టింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పటికీ థియేటర్స్ లో కొన్ని చోట్ల స్టడీగా ఉంది. సాధారణంగా మొదలై దృశ్యం రేంజ్ లో థ్రిల్లర్ గా టర్న్ తీసుకున్న ఈ మూవీలో అనేక అనూహ్యమైన మలుపులు కనిపిస్తాయి. ఇక తుడరుమ్ జియో హాట్ స్టార్ లో ఈ 30 నుంచి స్ట్రీమ్ అవుతోంది. ఇలాంటి మూవీస్ కు ఓటిటిలో కూడా మంచి రివ్యూసే వస్తాయని వేరే చెప్పక్కర్లేదు.

ఇక భారీ అంచనాలతో థియేటర్స్ కు వచ్చిన మూవీ రెట్రో. సూర్య, పూజాహెగ్డే జంటగా నటించిన ఈ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేశాడు. రిలీజ్ కు ముందు ప్రామిసింగ్ గా కనిపించిన రెట్రో రిలీజ్ తర్వాత మొదటి రోజుకే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అటు కోలీవుడ్ లో సైతం అదే టాక్ రావడంతో యూనానిమస్ డిజాస్టర్ గా డిక్లేర్ అయింది. మరి ఈ చిత్రానికి ఓటిటి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో కానీ రెట్రో ఈ నెల 31 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది.

మొత్తంగా మూడు సినిమాలకూ ఆడియన్స్ నుంచి ఎదురుచూపులున్నాయి. మరి ఓటిటిలో ఎవరికి ఎక్కువ ప్రశంసలు వస్తాయో చూడాలి.

Tags

Next Story